దేవబంద్ ఇస్లామిక్ పీఠం కొత్త ఆర్డర్ వేసింది. పెళ్లిళ్ల వంటి సామాజిక కార్యక్రమాల్లో ఆడ - మగ కలిసి కూర్చుని భోజనం చేయడం ఇస్లాం నియమాలకు విరుద్ధమని దేవబంద్ ఇస్లామిక్ పీఠం తేల్చిచెప్పింది. అంతేకాకుండా బఫే తరహాలో నిలబడి భోజనం చేయడం కూడా ఇస్లాంకు సరిపడదని పేర్కొంది. దేవబంద్ కు చెందిన ఓ ముస్లిం వ్యక్తి పంపిన సందేహానికి సమాధానంగా ఈ రెండు అంశాలపై గురువారం దేవబంద్ మతపెద్దలు ఫత్వా జారీచేశారు. విందుల్లో ఆడ - మగ కలిసి తినడం - నిలబడి తినడం ఇస్లామిక్ సూత్రాలకు అనుగుణమైందేనా? అనే సందేహంతో అతడు దేవబంద్ కు లేఖ రాశారు.
తన పేరు వెల్లడించేందుకు ఇష్టపడని వ్యక్తి దేవబంద్ దానికి సమాధానమిస్తూ రెండూ కూడా షరియా ప్రకారం ఇస్లాం విరుద్ధమైనవేనని స్పష్టం చేసింది. ఆ మేరకు దారుల్ ఇఫ్తా విభాగం ఫత్వా కూడా జారీచేసింది. పెళ్లిళ్ల వంటి కార్యక్రమాల్లో స్త్రీలు - పురుషులు కలిసి భోజనం చేయడం నా-జాయజ్ (అక్రమం) - పాపం అని ఫత్వాలో తెలిపింది. ఇక నిలబడి తినడం ముస్లిం సమాజాన్ని నాశనం చేస్తుందని - కనుక ఎవరూ ఆ పద్ధతి పాటించరాదని రెండో ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. దేవబంద్ ముస్లిం పీఠం ఇలాంటి ఫత్వాలు జారీ చేయడం ఇద మొదటిసారి కాదు. గాజుల దుకాణాల్ల ఆడవాళ్లు మగవారిచేత గాజులు వేయించుకోరాదని - చేతులు - కాళ్ల మీద వెంట్రుకలు తీయించుకొని వ్యాక్సింగ్ చేయించుకోరాదని వగైరా వగైరా ఫత్వాలు జారీచేసింది. అయితే, ఈ ఫత్వా వివాదాలకు కారణమైంది