కాంగ్రెస్ దిగ్గజం. ఆ మధ్యదాకా పంజాబ్ సీఎం గా పనిచేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ ఒక స్పష్టతకు వచ్చేశారు. ఇక పార్టీని నడపడం తన వల్ల కాదు అనుకున్నారు ఫ్యూచర్ లో రాజకీయ మనుగడ సాగించాలీ అంటే జాతీయ స్థాయిలో పెద్ద పార్టీగా ఉన్న బీజేపీలో విలీనం కావడమే ఏకైక మార్గమని భావిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి వేరుపడి పంజాబ్ లోక్ కాంగ్రెస్ అని పార్టీని ఈ మాజీ ముఖ్యమంత్రి స్థాపించిన సంగతి విధితమే.
అయితే పార్టీ పెట్టారు కానీ ఆశించిన రాజకీయ ఫలితాలను సాధించడంలో ఘోరంగా విఫలం అయ్యారు. నిజానికి కెప్టెన్ కి జనాలలో సానుభూతి ఉంది. పాలన బాగా చేసారు అన్న పేరు ఉంది. కానీ షార్ట్ పీరియడ్ కావడంతో పాటు కాంగ్రెస్ ఓట్లను పూర్తిగా తన వైపునకు రాబట్టలేకపోవడంతో ఈ చీలికలో ఆప్ భారీ లబ్ది పొందింది. ఆ మద్యన పంజాబ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి.
మరో అయిదేళ్ళ దాకా ఎన్నికలు అయితే లేవు. అంటే ఏడున్నర పదుల వయసు దాటేసిన ఈ వృద్ధ నేత తన ప్రాంతీయ పార్టీని అప్పటిదాకా కొనసాగించే సీన్ అయితే లేదు. దాంతో పాటు రాజకీయంగా మనుగడ సాగించాలీ అంటే బీజేపీలో చేరిపోవడమే బెటర్ అని భావిస్తున్నారుట. ఆ పార్టీలో చేరితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో నాయకుడు అవుతారు. పార్టీలో ఉపాధ్యక్ష పదవి దక్కుతుంది. ఆ మీదట కేంద్ర బీజేపీ పెద్దల దయ ఉంటే జాతీయ స్థాయిలో అయినా అధికార పదవులు దక్కవచ్చు.
ఇలా అన్ని రకాలుగా ఆలోచించిన మీదటనే కెప్టెన్ బీజేపీలో కలిసిపోవాలని చూస్తున్నారుట. ఇక ఈ విలీనం వల్ల బీజేపీకి కూడా పంజాబ్ లో ఊతం కొంత దొరుకుతుంది. వచ్చే ఎన్నికలకు బాటకు వేసుకునే చాన్స్ కూడా దక్కుతుంది. ఇలా ఉభయ కుశలోపరిగా ఈ విలీనం ఉంటుందని అనుకుంటున్నరు. ప్రస్తుతం లోయర్ బ్యాక్ సర్జరీ కోసం లండన్ వెళ్లిన అమరీందర్ సింగ్ కోలుకున్న వెంటనే భారత్ తిరిగి వస్తారు.
అలా వచ్చిన వెంటనే ఆయన చేసే మొదటి పని పార్టీని విలీనం చేసి బీజేపీ మనిషి కావడమే. ఇప్పటికే అమరీందర్ కు సన్నిహితులైన కీలక కాంగ్రెస్ నేతలలతో పాటు, పీపీసీసీ మాజీ అధ్యక్షుడు సునిల్ జఖర్ తోపాటు అమరీందర్ మంత్రివర్గంలో పనిచేసిన మజా దళిత నేత రాజ్ కుమార్ వెర్కా, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుందర్ శ్యామ్ అరోరా, సిక్కు నేతలు బల్బీర్ సింగ్ సిధ్దు, గుర్ ప్రీత్ సింగ్ కంగర్‌లు బీజేపీలో చేరారు. ఇపుడు కెప్టెన్ చేరికతో పంజాబ్ లో కాంగ్రెస్ లోని అతి పెద్ద వర్గం కమలం పంచన చేరినట్లు అవుతుంది అంటున్నారు.