రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఆసక్తి వ్యక్తమవుతున్న రాజకీయ అంశం ఏమైనా ఉందంటే.. అది మునుగోడు ఉప ఎన్నికే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద తీవ్రప్రభావాన్ని చూపే దీని గురించి సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. వాస్తవానికి.. కేసీఆర్ పెట్టే జాతీయపార్టీ మీద కంటే కూడా మునుగోడు ఉప పోరు ఫలితం ఎలా ఉంటుందన్న దానిపైనే ఎక్కువ చర్చ జరుగుతుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ఉపపోరుకు సంబంధించి తాజాగా ఒక అప్డేట్ ఆసక్తికరంగా మారింది.
ఈ ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. దీనిపై క్లారిటీ వచ్చేలా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్రానికి చెందిన ఎన్నికల అధికారులకు కీలక సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. దసరా తర్వాత మునుగోడు ఉప పోరుకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే వీలుందని చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. నవంబరులో ఉప ఎన్నిక జరగటం ఖాయమంటున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా తెలంగాణ ఎన్నికల సంఘానికి.. నల్గొండజిల్లా కలెక్టర్ కు సైతం ఏర్పాట్ల మీద వివరాలు అడిగినట్లుగా చెబుతున్నారు.
ఉప పోరులో కీలకభూమిక పోషించే ఈవీఎంలను సిద్ధం చేయటంతో పాటు.. ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తును పూర్తి చేసి.. సిద్దంగా ఉండాలన్న ఆదేశాలు అందినట్లుగా తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివర్లో గుజరాత్.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు మునుగోడు ఉప పోరు ఉంటుందని చెబుతున్నారు.
మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత.. ఇటీవల బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయటంతో ఈ ఉప పోరు అనివార్యం కావటం తెలిసిందే.
సిట్టింగ్ సీటును ఎట్టి పరిస్థితుల్లో నిలుపుకోవాలన్నది కాంగ్రెస్ ఆలోచన అయితే.. ఈ సీటును సొంతం చేసుకోవటం ద్వారా.. తెలంగాణలో రాజకీయంగా తమను దెబ్బ తీసే వారెవరూ లేరన్న విషయాన్ని తేల్చేయాలని టీఆర్ఎస్ పట్టుదలగా ఉంది.
దీనికి భిన్నంగా రాజగోపాల్ అసరాతో తమ సత్తా చాటటంతో పాటు.. తెలంగాణలో టీఆర్ఎస్ ను దెబ్బ కొట్టే మొనగాడి పార్టీగా బీజేపీని నిలిపేందుకు ఈ ఉప పోరుకు మించింది మరొకటి లేదన్న వాదన వినిపిస్తోంది. ఏమైనా.. మరికొద్ది రోజుల్లోనే మునుగోడు ఉప పోరు అంశంపై మరింత క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.