రేప్‌ ఆరోపణలకు రూ. 1 పరువు నష్టం దావ

Update: 2018-10-16 04:15 GMT
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం మీటూ ఉద్యమం గురించి తారా స్థాయిలో చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. తనూశ్రీ దత్తా మొదలు పెట్టిన ఈ లైంగిక ఆరోపణల పర్వంలో ప్రతి రోజు కొత్త వారి పేర్లు వినిపిస్తున్నాయి. తాము లైంగిక వేదింపులు ఎదుర్కొన్నామంటూ ఎంతో మంది మీడియా ముందుకు వస్తున్నారు. ఇన్నాళ్లు పెద్దమనుషులుగా చలామణి అయిన ఎంతో మంది సెలబ్రెటీల పేర్లు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో బాలీవుడ్‌ తో పాటు అన్ని సినిమా పరిశ్రమల్లో గందరగోళం నెలకొంది. తాజాగా నటుడు అలోక్‌ నాథ్‌ పై రచయిత, దర్శకురాలు వింటా నంద రేప్‌ ఆరోపణలు చేశారు.

19 ఏళ్ల క్రితం తనను నటుడు అలోక్‌ నాథ్‌ రేప్‌ చేశాడని, ఆ సమయంలో నేను ఈ విషయాన్ని బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తే తన కెరీర్‌ కు నష్టం జరుగుతుందని తన స్నేహితురాలు భయపెట్టిందని, అందుకే అప్పుడు తనపై జరిగిన లైంగిక దాడిని బయట పెట్టలేక పోయానని, ఇప్పుడు జరుగుతున్న మీటూ ఉద్యమంలో భాగంగా తాను ఈ విషయాన్ని బయట పెడుతున్నట్లుగా ఆమె పేర్కొంది. ఆయన బయట ప్రచారం జరుగుతున్నట్లుగా సంస్కారం ఉన్న వ్యక్తి కాదని, ఒక కీచకుడు అంటూ వింటా నంద తన ఫేస్‌ బుక్‌ ద్వారా ఆరోపించారు.

వింటా నంద ఆరోపణలపై అలోక్‌ నాథ్‌ స్పందించాడు. ఆమెను రేప్‌ చేసింది నేను కాదు, ఆమెను మరెవ్వరైనా రేప్‌ చేసి ఉంటారు. తనపై ఆధారం లేకుండా నిందలు వేసినందుకు గాను ఆమెపై పరువు నష్టం దావా వేస్తున్నట్లుగా అలోక్‌ నాథ్‌ ప్రకటించాడు. అయితే ఈయన కేవలం ఒక్క రూపాయికి పరువు నష్టం దావా వేయడం ప్రస్తుతం బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఆమె ఆరోపణలను నిరూపించాలని, లేదంటే వెంటనే తనకు రూపాయి చెల్లించి, క్షమాపణలు చెప్పాల్సిందిగా అలోక్‌ నాథ్‌ కోర్టు నోటీసులను వింటానందకు పంపించాడు.
Tags:    

Similar News