హాలీవుడ్‌లో మొదలైన మీటూ.. భారత్ కు అప్పట్లోనే చేరినా.. పెద్దగా రాజుకోలేదనే చెప్పాలి. అయితే..బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా పుణ్యమా అని రాజుకున్న ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. సినిమా రంగానికి మించి అన్ని రంగాలకు పాకింది. కీలకమైన రాజకీయ రంగంలో మీటూ ప్రకంపనల కారణంగా ఒక కేంద్రమంత్రి పదవి ఊడిపోయే వరకూ వచ్చిందన్న మాట బలంగా వినిపిస్తూ ఉంది.
మీటూ విమర్శల సుడిగుండంలో చిక్కుకున్న కేంద్రమంత్రి ఎంజే అక్బర్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకప్పుడు జర్నలిస్టు అయిన ఆయన.. రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ తరఫున ఎంపికై.. ఆ తర్వాత కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టటం తెలిసిందే. ఎంజే అక్బర్ తెలుగు వారికి సుపరిచితుడు. ఎందుకంటే.. ఆయన రాసిన వ్యాసాలు పలు తెలుగు పత్రికల్లో పబ్లిష్ అయ్యాయి.
గతంలో ఆయన డెక్కన్ క్రానికల్ గ్రూప్ కు ఎడిటోరియల్ డైరెక్టర్ గా వ్యవహరించారు కూడా. దీంతో.. ఆయన్ను ప్రత్యక్షంగా చూసినోళ్లు.. కలిసి పని చేసినోళ్లు.. ఆయన కింద వర్క్ చేసినోళ్లు చాలామందే ఉన్నారు. తాజా ఆరోపణల నేపథ్యంలో ఆయనకు సంబంధించిన సంచలన అంశాలుతెలుగు జర్నలిస్టు సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.
డెక్కన్ క్రానికల్ లో పని చేసే సమయంలో అక్కడ పని చేసే లేడీ జర్నలిస్టులతో అసభ్యంగా వ్యవహరించే వారన్న ఆరోపణలు ఉన్నాయి. అసభ్యంగా మాట్లాడటం.. అనుచితంగా ప్రవర్తించటంతో పాటు.. లోదుస్తుల్లో చేతులు పెట్టేవాడన్న విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఆయన అందమైన అమ్మాయిల్ని కొంతమందికి సప్లై చేశారన్న తీవ్రమైన ఆరోపణ ఉంది. అయితే.. అదిప్పుడు కాదని.. గతంలో అన్న మాట జర్నలిస్టు సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. అయితే.. అదంతా తమకు తెలిసిన వారు చెప్పిన విషయాలే కానీ.. వారు చూసింది కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇదిలా ఉంటే.. ఎంజే అక్బర్ మీద తాజాగా అమెరికన్ జర్నలిస్టు ఒకరు స్పందిస్తూ.. పద్దెనిమిదేళ్ల వయసులో తాను ఇంటర్న్ షిప్ కోసం వస్తే.. తనపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఆరోపించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై వచ్చిన ఆరోపణలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పందించారు.
అమెరికా జర్నలిస్టు ఒకరు సోషల్ మీడియాలో ఎంజే అక్బర్ చేసిన ఆరోపణల్ని తనిఖీ చేస్తామని.. ఒకవేళ అది నిజమన్న విషయం తేలితే.. ఆయనపై చర్యలు తప్పవన్న మాటను ఒక ప్రముఖ మీడియా సంస్థకు తాజాగా చెప్పారు. ఎంజే అక్బర్ పై వస్తున్న విమర్శల నేపథ్యంలో బీజేపీ నేతలు పలువురు గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటివరకూ వస్తున్న సమాచారం ప్రకారం.. ఎంజే అక్బర్ ను సాగనంపేందుకు బీజేపీ అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అధికారికంగా తాము తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయటమే మిగిలి ఉందని చెబుతున్నారు.