అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మెక్సికో సరిహద్దు వద్ద గోడ నిర్మిస్తానని ట్రంప్ చేసిన వాగ్ధానానికి వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు ఆందోళన నిర్వహించారు. మెక్సికో బోర్డర్ సమీపంలో మానవహారంతో తమ నిరసనను వ్యక్తం చేశారు. సరిహద్దు పొడుగునా మానవ హారంతో ప్రదర్శన చేపట్టారు. రాజకీయ నాయకులు - సామాజిక కార్యకర్తలు - విద్యార్థులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. బోర్డర్ ఉన్న పట్టణమైన సుడాడ్ జురేజ్ లో ప్రదర్శన నిర్వహించారు. గోడ నిర్మాణం ఓ చెత్త ఐడియా అని, దాని వల్ల డ్రగ్స్ కానీ, వలసదారులు కానీ ఆగరని ఆందోళనకారులు నినదించారు. అక్రమ వలసదారులను అడ్డుకునేందుకు మెక్సికో సరిహద్దు వెంట గోడ నిర్మిస్తానని ట్రంప్ ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారు. దానికి తగ్గట్టుగానే ఆయన గోడ నిర్మాణానికి కావాల్సిన అన్ని చర్యలను చేపట్టాలని ఇటీవల ఆదేశాలు కూడా జారీ చేశారు. సరిహద్దు వెంట గోడ నిర్మించాలనుకున్న ట్రంప్ ఆ నిర్మాణ వ్యయం మెక్సికోనే భరిస్తుందన్నారు.
మరోవైపు పదవి బాద్యతలు చేపట్టి నెల రోజులు పూర్తయిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్ అమెరికాలోకి ఏడు ముస్లిం దేశాల వలసల నిరోధం విషయంలో రాజీలేదని పునరుద్ఘాటించారు. తొలి ఉత్తర్వు వివాదాస్పదం కావడంతో.. మరో కార్యనిర్వాహక ఉత్తర్వుకు పదునుపెడుతున్నామన్నారు. వచ్చేవారమే దీన్ని జారీ చేయడం ఖాయమని వెల్లడించారు. ‘అమెరికాకు వలసల నిషేధంపై కొత్తగా రూపొందించనున్న ఉత్తర్వులను లోతుగా, గట్టిగా అధ్యయనం చేస్తున్నాం. చట్టపరంగా, న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా ఉత్తర్వు ఉండటం ఖాయం’ అని వైట్ హౌస్ న్యూస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ స్పష్టం చేశారు. ఏడు ముస్లిం దేశాలపై ‘ప్రయాణ నిషేధ’ ఉత్తర్వులను జారీ చేస్తూ ఇంతకుముందు ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులకు న్యాయ విభాగం నుంచి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ‘తాజా ఉత్తర్వు ఎలా ఉండాలన్న అంశంపై దేశంలోని నిపుణులైన న్యాయవాదులు కసరత్తు చేస్తున్నారు. కోర్టు ఏ అభ్యంతరాలనైతే వ్యక్తం చేసిందో వాటిని అధిగమించే విధంగానే తాజా ఉత్తర్వు ఉండబోతోంది’ అని నొక్కి చెప్పారు. అయితే, ఆ ఉత్తర్వుకు సంబంధించిన ఎలాంటి వివరాలూ ట్రంప్ వెల్లడించలేదు.
ఏడు ముస్లిం దేశాలైన ఇరాన్ - సూడాన్ - లిబియా - సోమాలియా - సిరియా - ఇరాక్ - యెమెన్ లపై ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులు చెల్లవంటూ తొమ్మిదొవ అప్పీళ్ల కోర్టు కొట్టివేయడంపై అధ్యక్షుడు ట్రంప్ గుర్రుగా ఉన్నారు. వలసల నిషేధంపై కోర్టు నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ ‘అమెరికా రక్షణకు సంబంధించి 9వ అప్పీళ్ల కోర్టు తీసుకున్న నిర్ణయం ఏమాత్రం సహేతుకం కాదు. అదొక చెడ్డ నిర్ణయం’ అని వ్యాఖ్యానించారు. తాజా ఉత్తర్వు ప్రకారం వలస వచ్చేవాళ్లను, శరణార్థులను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని, విస్తృతమైన తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంటుందని ట్రంప్ వెల్లడించారు. ‘ఇవన్నీ అమెరికా రక్షణకు తీసుకుంటున్న చర్యలే. కొత్త ఉత్తర్వు ఆమోదం పొందడానికి అందరి సహకారం అవసరం’ అని కోరారు. ‘మా ఉద్దేశం విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నాం. అదే సమయంలో విస్తృతమైన కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుతో అంతిమంగా అమెరికా, అమెరికన్ల రక్షణ సాధ్యమని ఆశిస్తున్నాం’ అని ట్రంప్ స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/