విశ్వం ఒక లోతైన రహస్యం. ఖగోళ శాస్త్రవేత్తలు, ఇతర నిపుణులు తమ పరిశోధనల ద్వారా ఖగోళం యొక్క ఒక్కో రహస్యాన్ని విప్పేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా శాస్త్రీయ పురోగతితోపాటు ఖగోళ శాస్త్రవేత్తలు సూపర్ ఎర్త్‌ను కనుగొన్నారు. ఖగోళ శాస్త్రవేత్తలు అంతరిక్షంలో భూమి వంటి మరో గ్రహం కోసం చాలా కాలంగా వెతుకుతున్నారు. చాలా సార్లు వారు ఇందులో విజయవంతం అయ్యారు. అయితే, అనేక ఇతర కారణాల వల్ల భూమి వంటి గ్రహం లభించినప్పటికీ, ఈ గ్రహాలపై మానవులు జీవించే అవకాశం లేకపోవడంతో వాటిని భూమిగా పేర్కొనడం సాధ్యపడలేదు. ఎన్నో అద్భుతాలకు నిలయం అంతరిక్షం. గుర్తించాలే గానీ లెక్కలేనన్ని విశేషాలు వెలుగు చూస్తాయి. తాజాగా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంతరిక్షానికి సంబంధించి అద్భుతమైన ఫోటోను ఒకదానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
100 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అతిపెద్ద, అందమైన గెలాక్సీకి సంబంధించిన ఫోటోను నెటిజన్లతో పంచుకుంది. నీలి వర్ణంలో కాంతులీనుతున్న ఆ పాలపుంతలో తెల తెల్లగా మిణుకు మిణుకుమంటూ నక్షత్రాలు మెరుస్తున్నాయి. చిమ్మ చీకటికి తోడు, నీలి కాంతి ప్రసరిస్తుండటంతో ఆ పాలపుంత చూడటానికి అద్భుతంగా కనిపిస్తోంది. ఇక ఆ పాలపుంత మధ్యలో సూర్యుని వలే అతిపెద్ద నక్షత్రం ఎర్రగా భగభగలాడుతూ సదరు గెలాక్సీ లో ఆధిపత్యం చెలాయిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ అద్భుతమైన చిత్రాన్ని నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ తీసింది. కాగా, జర్మన్ ఖగోళ శాస్త్రవేత్త విల్హెల్మ్ టెంపెల్ 1876 లోనే NGC 2336 ని కనిపెట్టారు. కామెలో పార్డాలిస్ ఉత్తర రాశిలో ఉన్న ఈ గెలాక్సీ దాదాపు 2,00,000 కాంతి సంవత్సరా లలో విస్తరించి ఉంది. ఈ పాలపుంతను టెంపెల్ 11 అంగుళాల టెలిస్కోప్ ను ఉపయోగించి కనిపెట్టడం విశేషం. మళ్లీ 111 సంవత్సరాల తరువాత ఈ గెలాక్సీ ఫోటోలను బంధించారు. కాగా, ఇది సూపర్ నోవా అని, గెలాక్సీల్లో కెల్లా అతిపెద్దిగా నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇక, హబుల్ టెలిస్కోప్ ను టెంపెల్ టెలి స్కోప్ తో పోల్చి చూస్తే పరిమాణంలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. హుబుల్ టెలీస్కోప్ దాదాపు 10 రెట్లు పెద్దగా ఉంటుంది. ఇక దీని మెయిన్ గ్లాస్ 7.9 అడుగుల పరిమాణంలో ఉంటుంది. హబుల్ టెలిస్కోప్ ఏప్రిల్ 1990 లో ప్రారంభించారు. అప్పటి నుండి దీని సహాయంతో గ్రహాలు, ఉల్కలు, సూపర్ నోవాలు, గెలాక్సీలు, ఇతర ఖగోళ వస్తువులు, అంతరిక్షంలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు సంబంధించి అద్భుతమైన ఫోటోలను తీస్తున్నారు. ఈ చిత్రాలు ఖగోళ శాస్త్రవేత్తలకు విశ్వం పుట్టుకున అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తున్నాయి.