కొట్టించుకున్నందుకు కేసులా..?

Update: 2016-02-05 04:24 GMT
ఎక్కడైనా కొట్టించుకున్నోడిపై కేసులు పెడతారా? ఎక్కడ పెడతారో లేదో కానీ.. హైదరాబాద్ లో చోటు చేసుకున్న తాజా ఘటనలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మరింత షాక్ కలిగే పరిణామాలు చోటు చేసుకున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన పోలింగ్ సందర్భంగా తెలంగాణ ముఖ్యనేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. షబ్బీర్ అలీలపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. ఆయన పార్టీ కార్యకర్తలు దాడి చేయటం తెలిసిందే.

దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలపై దాడి చేసిన వారిపై కేసులు నమోదయ్యాయి.  ఆసక్తికరంగా తాజాగా ఉత్తమ్.. షబ్బీర్ లపై కేసులు నమోదు చేస్తూ హైదరాబాద్ పోలీసులు నిర్ణయం తీసుకోవటంపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తమపై కాంగ్రెస్ నేలు.. పోలీసులు దాడి చేసినట్లుగా మజ్లిస్ పార్టీకి చెందిన కొందరు ఇచ్చిన ఫిర్యాదుతో ఉత్తమ్.. షబ్బీర్ లపై కేసులు నమోదు చేశారు. కెమేరాల సాక్షిగా ఉత్తమ్.. షబ్బీర్ లపై మజ్లిస్ మూక దాడికి తెగబడటం కనిపించినా.. మజ్లిస్ పార్టీకి చెందిన వారిచ్చిన ఫిర్యాదుతో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలపై కేసులు నమోదు చేయటం గమనార్హం. కొట్టించుకున్నందుకు కూడా కేసులు తప్పవన్నట్లు పరిస్థితి ఉందంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు మండిపడటం గమనార్హం.
Tags:    

Similar News