ఈ సమాజంలో ఒకరు ఉన్నట్టు మరొకరు ఉండరు. ప్రతి నిత్యం కళ్లముందు ఎన్ని ఘోరాలు , ఘటనలు జరుగుతున్నా కూడా అసలు మనం ఏమీ చూడలేదు , మనకేమీ కాలేదు అని అక్కడి నుండి తప్పించుకుపోతుంటారు. ముఖ్యంగా ఏదైనా ప్రమాదం జరిగితే మనకెందులే అనిఅక్కడి నుండి వీలైనంత త్వరగా సైడైపోతాం. ప్రస్తుత సమాజంలో ఈ తరహా మనుషులే ఎక్కువ గా ఉన్నారు. అయితే , కొందరు మాత్రం తెగింపు , దైర్యం కలిగి ఉంటారు. సమాజంలో జరిగే తప్పులపై వేలెత్తి చూపుతారు. అవసరం అనుకుంటే ఆ సమస్యలపై గొంతెత్తి మాట్లాడి , ఆ సమస్య కి ఓ పరిష్కారం చూపుతారు. నలుగురికి సహాయం చేయాలని చూస్తారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇలాంటి తెగువను చూపించి మీరు నిజంగా మనసున్న మనిషి... మంత్రి గారూ అనిపించుకున్నారు. తన కళ్ల ముందే ఓ బైకును ఢీకొని పరారయ్యేందుకు ప్రయత్నించిన వాహనాన్ని ఛేజ్ చేసి సినీ ఫక్కీలో పట్టుకున్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.
వివరాల్లోకి వెళ్తే .. మంత్రి కాన్వాయ్ హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వస్తున్న క్రమంలో రాజాపూర్ సమీపంలో ముదిరెడ్డిపల్లికి చెందిన శ్రీనివాస్ బాలానగర్ నుంచి సొంతూరుకు బైక్ పై వస్తున్నాడు. హైదరాబాద్ నుంచే కర్ణాటక వెళ్తున్న బొలెరో వాహనాం రాజాపూర్ శివారులో బైక్ ను ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది. అప్పుడు అటుగా వస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన వాహనాన్ని వేగంగా ముందుకు తీసుకుపోమని డ్రైవర్ ను ఆదేశించారు. ఆక్సిడెంట్ చేసి పరారవుతున్న కర్ణాటకకు చెందిన బొలెరోను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. బైక్ ను ఢీకొట్టి తప్పించుకునే ప్రయత్నం చేసిన బొలెరో వాహనాన్ని ఛేజ్ చేసి 3 కి.మీ లోపే పట్టుకున్నారు. మంత్రి వాహనాన్ని అడ్డంగా పెట్టి బొలెరో వాహనాన్ని ఆపారు. ఆ తర్వాత డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. గాయపడిన శ్రీనివాస్ ను రాజాపూర్ పీహెచ్ సీలో ప్రథమ చికిత్స చేసి మహబూబ్ నగర్ కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాద్ కు పంపించారు. తన కళ్ల ముందే ప్రమాదాన్ని చూసి వెంటనే మానవత్వంతో స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ వల్లే బాధితునికి వెంటనే చికిత్స అందింది. తప్పుచేసిన డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారని స్థానికులు తెలిపారు. మంత్రి సాయానికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.