`లక్ష్మీస్ ఎన్టీఆర్` పేరుతో సినిమా తీయనున్నట్లు ప్రకటించింది మొదలు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వార్తల్లో నిలుస్తున్నారు. తెలుగువారి ఖ్యాతిని చాటిచెప్పిన ఎన్టీఆర్‌పై తీసే సినిమా ఎలా ఉంటుందనే క్రేజ్ మొదట ప్రారంభం కాగా అనంతరం ప్రతిపక్ష వైసీపీ స్పాన్సర్డ్ సినిమా అనే ప్రచారంతో తీవ్రంగా చర్చల్లోకి వచ్చింది. దీనికి కొనసాగింపు అన్నట్లుగా పలువురు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వర్మను టార్గెట్ చేయడంతో...ఈ వివాదం మరింత ముదిరింది. అయినప్పటికీ వాటికి వర్మ తనదైన శైలిలో వివరణ ఇస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ జీవితంలోని కీలకఘట్టాలను తాను తెరకు ఎక్కించనున్నాట్లు...సినిమా రాకముందే ఇంతగా స్పందించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
వర్మ వర్సెస్ టీడీపీ నేతల వాగ్వాదానికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా మరో టీడీపీ మంత్రి వర్మపై విరుచుకుపడ్డారు. వర్మ తీయాల్సింది ఎన్టీఆర్ సినిమా కాదు.. జగన్ 420 పేరుతో సినిమా తీయాలని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్‌శాఖ మంత్రి జవహర్ సూచనలు ఇచ్చారు. ఈ విధంగా సినిమా తీస్తే బాగుంటుందని వర్మకు సలహాలు ఇచ్చారు.ఈ సందర్భంగా సహజంగానే వైఎస్ జగన్‌పై ఏపీ మంత్రి విరుచుకుపడ్డారు. త్వరలో ప్రారంభించనున్న వైఎస్ జగన్ పాదయాత్రను ప్రస్తావిస్తూ... నవంబర్ 2నుంచి పాదయాత్ర ఎందుకు చేయనున్నారో జగన్‌కే స్పష్టత లేదని మంత్రి జవహర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నిత్యం అలజడులు సృష్టించే జగన్.. పాదయాత్ర ద్వారా ఎలాంటి అల్లర్లు సృష్టిస్తారోనని ఆయన వ్యాఖ్యానించారు.