కల్వకుంట్ల కవిత...తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తనయగా మాత్రమే పరిచయం చేస్తే...ఖచ్చితంగా అది అమె స్థాయిని తగ్గించడమే. నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అంటే కూడా ఆ ఇంట్రడాక్షన్ సరిపోదు. వీటితోపాటుగా ఎంతో చైతన్యవంతమైన తెలంగాణ పాలిటిక్స్ లోని క్రియాశీల రాజకీయ వేత్తల జాబితా తీస్తే...అందులో ఆమెది యాక్టివ్ రోల్. ఇటీవల అయితే, పేజ్ 3 సెలబ్రిటీగా కూడా మీడియాలో కనిపించారు. అయితే...ఇంత యాక్టివ్ గా ఉండే ఎంపీ కవిత పార్టీ శ్రేణులకు - ఆమె సన్నిహితులకు సర్ ప్రైజ్ ఇచ్చారు.
ఆ సర్ ప్రైజే..గత కొన్ని రోజులగా ఆమె తెరపైన ఎక్కడా కనిపించకపోవడం! ఇటు పార్టీ కార్యక్రమాలు అటు నియోజకవర్గ వ్యవహారాలు..మరోవైపు తన ఎన్జీవో అయిన తెలంగాణ జాగృతి తరఫున కూడా ఆమె ఎక్కడా కనిపించడం లేదు. ఆఖరికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో కూడా ఎంపీ కవిత కనిపించలేదు. ఈ పరిణాయం టీఆర్ ఎస్ వర్గాల్లో ఆశ్చర్యంలో విస్మయం కలిగిస్తున్నాయని అంటున్నారు. ఇటీవల తెలంగాణలో ఎన్నో కీలక పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత - పవర్ స్టార్ పవన్ తెలంగాణ పర్యటన సహా పలు రాజకీయ సంఘటనలు చోటుచేసుకున్నాయి.
పవన్ తెలంగాణలో పర్యటించిన కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం ఎంపీ కవిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో పవన్ తెలంగాణ గురించి ప్రస్తావిస్తే ఓ రేంజ్ లో కవిత రియాక్టైన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే స్వయంగా తన ఇలాకాలో పర్యటించినప్పటికీ...ఆ పర్యటన గడిచి దాదాపు వారం అవుతున్నప్పటికీ ఎంపీ కవిత స్పందనలేదు. అదే సమయంలో ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండటం కూడా చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో ఆమె తెరమరుగు కారణం ఏమనే చర్చ కూడా మొదలైంది.