ప్రోగ్రాంల మీద ప్రోగ్రాంలు అటెండ్ కావటంతో మంత్రి కేటీఆర్ తర్వాతే ఎవరైనా. హైదరాబాద్ మహానగరంలో జరిగే ముఖ్యమైన కార్యక్రమాలకు ముఖ్యఅతిధిగా ఆయనే వ్యవహరిస్తున్నారు. సీఎం అటెండ్ కావాల్సిన ప్రోగ్రాంలకు కూడా కేటీఆర్ కవర్ చేస్తున్నారన్న విమర్శ ఉంది. రాష్ట్రానికి వచ్చే కీలక అతిధులు పాల్గొనే కార్యక్రమాల్లోనూ కేటీఆర్ దర్శనమివ్వటం ఈ మధ్యన తరచూ కనిపిస్తోంది.
ముఖ్యమంత్రే రావాల్సిన అవసరం ఏముంది?. మంత్రి కేటీఆర్ ఉన్నారుగా? అన్న చందంగా కొన్ని కార్యక్రమాల్లో ముఖ్యఅతిధిగా ఆయనే వస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తన తండ్రి కమ్ ముఖ్యమంత్రి కేసీఆర్ రాని లోటును కనిపించకుండా చేయటంలో కేటీఆర్ తీరు భలేగా ఉంటుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఒక అవార్డు ఫంక్షన్ కు హాజరైన ఆయన.. ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టాయే తప్పించి భవిష్యత్ తరాల గురించి ఆలోచించటం లేదన్నారు. తెలంగాణ ఎక్స్ లెన్సీ అవార్డుల కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
తాను అమెరికాలో ఉన్న ఎనిమిదేళ్లలో ప్రభుత్వం వద్దకు ఒక్కసారి మాత్రమే వెళ్లినట్లుగా చెప్పారు. అది కూడా డ్రైవింగ్ లైసెన్స్ కోసమేనని చెప్పారు. తమకు బలమైన అధికార యంత్రాంగం ఉందన్న కేటీఆర్.. ముఖ్యమంత్రి రచ్చబండలు నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. పవర్ అన్నది కేంద్రీకృతం కావటం మంచిది కాదన్న కేటీఆర్.. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నదేమిటో? మాటల నీతులు కోటలు దాటతాయి కానీ.. చేతల్లో మాత్రం అవేమీ కనిపించవన్న దానికి మంత్రి కేటీఆర్ మాటల్నినిదర్శనంగా చెప్పాలి. ప్రత్యర్థులు రాజకీయాల మీద దృష్టి పెడుతున్నట్లుగా చెప్పిన కేటీఆర్.. తన తండ్రి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్స్ పేరుతో అలాంటి పని ఎప్పుడో పూర్తి చేశారన్నది మర్చిపోయినట్లున్నారే.?