రాహుల్‌ కు కేటీఆర్ భ‌లే ట్వీట్ చేశారే!

Update: 2018-07-07 06:34 GMT
ఇటీవ‌లి కాలంలో కాంగ్రెస్ పార్టీపై పెద్ద ఎత్తున విరుచుకుప‌డుతున్న టీఆర్ ఎస్ నేత‌ - తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కు అవ‌కాశం క‌లిసి వ‌స్తే ఎందుకు వ‌దులుకుంటారు? స‌ద‌రు చాన్స్‌ ను చ‌క్క‌గా ఉప‌యోగించుకొని ఎదురుదాడి చేస్తారు. అలా తాజాగా కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్‌ గాంధీని ఆయ‌న టార్గెట్ చేశారు. రైతులకు రుణమాఫీ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. నాలుగు ఇన్‌ స్టాల్‌ మెంట్లలో రైతులకు తెలంగాణ ప్రభుత్వం రుణ మాఫీ చేసింది. అదే ప్రక్రియను కర్నాటక ప్రభుత్వం కూడా ఫాలో అవుతోంది. ఇటీవల కర్నాటకలో ఏర్పడిన జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ప్రకటించింది. సీఎం కుమారస్వామి మొన్ననే రుణమాఫీ కల్పిస్తూ బడ్జెట్‌ లో ప్రకటన చేశారు.

ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసినట్టుగానే జేడీఎస్ నేత - కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రూ.34వేల కోట్ల మేరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేశారు. కర్ణాటకలోని జనతాదళ్ (ఎస్) - కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ గురువారం తమ మొదటి బడ్జెట్‌ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం కుమారస్వామి బడ్జెట్‌ ను ప్రవేశపెడుతూ - ఒక్కో రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తున్నామని, అంతకుమించి ఉన్న వాటిని రద్దు చేయడం సబబు కాదని భావించామని పేర్కొన్నారు. ఈ ప‌రిణామం ఆధారంగానే ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ తన ట్విట్టర్‌ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రశ్నించారు. `కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌లో కూడా తెలంగాణ మాడల్ తరహాలో మాఫీని చేయాలని ఆయన నిర్ణయించారు. కానీ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ మాత్రం విచిత్ర వాదనను వినిపిస్తోంది. రాష్ట్రంలో ఆనవాళ్లు కోల్పోతున్న ఆ పార్టీ ఒకే ఇన్‌ స్టాల్‌ మెంట్‌ లో రైతులకు రుణమాఫీ చేస్తానంటోంది. ఇదెలా సాధ్యం` అంటూ కేటీఆర్ ఘాటుగా ప్ర‌శ్నించారు.
Tags:    

Similar News