ఇదేమీ మిడ్ నైట్ మసాలా లాంటి వ్యవహారం కాదు. కాకపోతే... అంతకంటె తక్కువ ఆసక్తికరమైనది కూడా కాదు. అవును మరి.. ప్రెస్ మీట్ లో నోరు జారిన పాపానికి ఓ మంత్రిగారు అర్ధరాత్రి దాకా మిడ్ నైట్ మసాలాను తలపించే బూతు వీడియోలను స్వయంగా పరిశీలించి... ఆ తర్వాత.. తన మాటల్లో పొరబాటు దొర్లిందని గ్రహించి.. దాని వలన ఎలాంటి నష్టానికి గురికాకుండా ఉండడానికి అర్ధరాత్రి వేళ మరొక ప్రెస్ నోట్ ను కూడా విడుదల చేయాల్సి వచ్చింది. ఇదంతా ఏపీలోని మంత్రి మాణిక్యాల రావుకు సంబంధించిన సంగతి.
ఏపీలోని ఆలయాలకు సంబంధించిన పరిపాలన బాధ్యతలు చూసే ఈ మంత్రిగారికి సేవ్ టెంపుల్ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ అయిన గజల్ శ్రీనివాస్ తో సత్సంబంధాలు ఉండడం విశేషం ఎంత మాత్రమూ కాదు. ఆ రకంగా వారిద్దరికీ పరిచయం మాత్రమే ఉన్నదనుకుంటే వివాదమే ఉండేది కాదు.. కానీ.. మంత్రిగారు తన జాలిగుండెతో.. శ్రీనివాస్ అరెస్టు అయిన తర్వాత.. అతను చిన్నప్పటినుంచి తనకు తెలుసునని ఆడవారిని వేధించే తత్వం అతనిది కాదని.. అతణ్ని కుట్ర చేసి లైంగిక వేధింపుల కేసులో ఇరికించారని సమర్థిస్తూ ప్రకటన చేశారు.
కానీ తమాషా ఏంటంటే.. మంత్రిగారు ఆ ప్రకటన చేసే సమయానికే గజల్ శ్రీనివాస్ పీకల దాకా ఈ లైంగిక వేధింపుల కేసులో కూరుకుపోయి ఉన్నారు. ఆయన లైంగిక వేధింపులకు సంబంధించి.. అప్పటికే అనేక వీడియోలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇవేవీ తెలియకముందే.. మంత్రిగారు సానుభూతి చూపించేశారు. ఆ వెంటనే.. ఆయనకు ఎటునుంచి ఎవరు పురమాయించారో గానీ.. రాత్రి పొద్దుపోయిన తర్వాత.. గజల్ శ్రీనివాస్ పాత్రధారిగా ఉన్న లైంగిక వేధింపుల వీడియోలు అన్నీ ఆయన స్వయంగా చూడాల్సి వచ్చింది. తక్షణం స్పందించకపోతే.. తెల్లారేలోగా తన పరువు గంగలో కలిసిపోతుందని మంత్రిగారికి భయం వేసినట్లుంది. అందుకే అర్ధరాత్రి సమీపిస్తున్న సమయంలో మరొక ప్రెస్ నోట్ ను తన తరఫున విడుదల చేయించారు. అప్పటిదాకా గజల్ ను అడ్డగోలుగా సమర్థించిన మంత్రి.. తనకు తెలిసిన గజల్ వేరు అని.. ఇలాంటి వారికి శిక్ష పడాల్సిందేనని.. అంటూ మాట మార్చేసి తన పరువు కాపాడుకున్నారు.
అయినా.. జనం మాత్రం ‘‘అడుసు తొక్కనేల కాలు కడగనేల?’’ అనేది పాత సామెత... ‘‘తొందరపడి నోరు జారనేల... మిడ్ నైట్ ప్రెస్ నోట్ ఏల?’’ అంటూ నవ్వుకుంటున్నారు.