పరిటాల రవీంద్ర... తన సొంత జిల్లా అనంతపురంతో పాటు తెలుగు నేల వ్యాప్తంగా మంచి గుర్తింపు కలిగిన నేత. నక్సలిజం ట్రాక్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రవి... ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఇట్టే వాలిపోయే రకమని ఆయన గురించిన ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. రాజకీయ ప్రత్యర్థులతో ఎలాంటి వైరం ఉన్నా... ప్రజల విషయానికి వస్తే రవి మంచి వ్యక్తిగానే పేరు సంపాదించారు. అయితే రవి మరణానంతరం ఆయన రాజకీయ వారసురాలిగా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన టీడీపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి పరిటాల సునీత వ్యవహారం చూస్తుంటే మాత్రం పరిటాల రవి ఆత్మ క్షోభించక మానదన్న వాదన వినిపిస్తోంది. తనకు సహకరించకపోవడం, తనపైనే ఆరోపణలు గుప్పిస్తూ వ్యాఖ్యలు చేయడాన్ని సునీత ఏమాత్రం సహించేలా లేరనే తాజాగా తేలిపోయింది.
పెంచిన పింఛన్ల పంపిణీ సందర్భంగా తన మాట వినలేదన్న కారణంగా పరిటాల సునీత వర్గీయులు ఏకంగా మహిళలపైకే దండెత్తారు. దండెత్తడమంటే ఏందో బెదిరించి పారిపోయేలా చేశారనుకోవడానికి లేదు... పురుషులై ఉండి కూడా మహిళలపైకి రాళ్లు రువ్వుతూ నానా యాగీ చేశారు. ఈ దందాకు సునీతమ్మ సొంత సోదరుడు మురళి నేతృత్వం వహించడంతో పాటు స్వయంగా రాళ్లెత్తుకుని మరీ మహిళలను వెంటబడి మరీ తరిమారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే...ఎన్నికల వేళ ఓటర్లకు తాయిలాలు ప్రకటిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఇటీవలే డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ పేరిట ఒక్కో మహిళకు రూ.10 వేల చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఆ మొత్తాన్ని ఒకే సారి కాకుండా మూడు విడతలుగా చెల్లిస్తామని కూడా పేర్కొన్నారు. ఈ క్రమంలో గడచిన రెండు, మూడు రోజులుగా డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ మొదలైంది.
ఈ క్రమంలోనే సునీత సొంత నియోజకవర్గం రాప్తాడులోనూ ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో భాగంగా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సోదరుడు మురళి వెళ్లారు. చెక్కులను అందుకునేందుకు వచ్చిన మహిళలకు ఆయన ఓ నిబంధన పెట్టారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకే ఓటు వేస్తామని ప్రమాణం చేసి చెక్కులు అందుకోవాలని సూచించారు. అయితే అందుకు మహిళలు ససేమిరా అన్నారు. అంతే ఒక్కసారిగా పేట్రేగిపోయిన మురళి తన అనుచరులతో కలిసి మహిళలపైకి రాళ్లు రువ్వుతూ తరిమికొట్టారు. ఈ ఘటనను మొత్తం సెల్ ఫోన్లో రికార్డు చేసిన ఓ వ్యక్తి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారిపోయింది.