సీమ ప్రజలు పాలనా రాజధాని కోరట్లేదు.. మంత్రి పెద్ది రెడ్డి వ్యాఖ్యలు
ఏపీలో మూడు రాజధానుల వివాదం ఒకవైపు సాగుతుండగానే.. మరోవైపు.. అమరావతి రైతులు మహాపాదయాత్రను కొనసాగిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఎవరు ఏది కోరుకుంటున్నారు? అనే ప్రశ్న తరచుగా తెరమీదికి వస్తోంది. విశాఖను పాలనా రాజధాని చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇక, గతంలో జరిగిన పెద్దమనుషుల ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి.. దానిని న్యాయరాజధాని చేయాలని భావిస్తోంది. ఇక, ప్రస్తుతం ఉన్న అమరావతిని శాసన రాజధానిగా మారుస్తామని చెబుతోంది. అయితే.. ఈ విషయంలోనే రైతులకు, ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తోంది.
ఇక, ఏ ప్రాంతం ప్రజలు ఏది కోరుతున్నారని అంటే.. పెద్దగా క్లారిటీ లేదనే చెప్పాలి. అసలు తమను ప్రత్యేక రాష్ట్రం చేయాలని సీమ ప్రాంత ప్రజలు కొన్నాళ్లు ఆందోళనలు చేశారు. ఇక, ఇప్పుడు హైకోర్టు ఇచ్చి న్యాయ రాజధాని చేయాలని కోరుతున్నారు. మరోవైపు.. విశాఖను పాలనా రాజధాని చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆ దిశగా అక్కడి ప్రజలు ఆశించిన విధంగా స్పందిస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. ఇదిలావుంటే.. తాజాగా ఏపీ ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికగా స్పందించారు. అసలు సీమ ప్రజలు పాలనా రాజధాని కోరుకోవడం లేదన్నారు.
వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రకారం విశాఖలో పాలనా రాజధాని, అమరావతిలో చట్టసభల రాజధాని, కర్నూల్లో న్యాయరాజధాని ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వ విధానం మూడు రాజధానులే అని చెప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ అంశంలో ఓ కొత్త విషయం చెప్పారు. రాయలసీమ పాలనా రాజధాని కోరుకోవడం లేదని, హైకోర్టు సరిపోతుందని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో సీమ నుంచి వెళ్లి రాష్ట్రాన్ని పాలించే స్థాయికి ఎదిగిన సీఎంలంతా హైదరాబాద్ ను మాత్రమే అభివృద్ధి చేశారని పెద్దిరెడ్డి తెలిపారు. అయితే.. సీమలో మాత్రం పాలనా రాజధాని అవసరం లేదని.. పెద్దిరెడ్డి చెప్పడం గమనార్హం.
ఎందుకంటే.. పాలనారాజధానిని సీమకు తెస్తే.. కాదనేవారు ఎవరు ఉంటారు? అనేది ప్రశ్న. పైగా వెనుకబడిన జిల్లాలు ఉన్న సీమలో పాలనారాజధాని రావడం వల్ల మరింత మెరుగైన పరిస్థితి ఏర్పడి ఇక్కడ కరువు తగ్గి వలసలకు అడ్డుకట్ట పడుతుందనే భావన ఉంది. కానీ, ఈ విషయాలు ప్రస్తావించని పెద్దిరెడ్డి తన మానాన తను చెప్పుకొని పోయారు.
మీడియాపై ఆగ్రహం!
మరోవైపు విశాఖ రాజధాని ఇష్టం లేకనే కొన్ని పత్రికలు అక్కడ ల్యాండ్ స్కాం అంటూ వార్తలు రాస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. విశాఖలో అక్రమాలకు పాల్పడ్డ అధికారులపైనా చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. రాజకీయంగా నడవలేని వ్యక్తిని పైకి లేపాలని ప్రయత్నిస్తున్నారని చంద్రబాబును ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులు రిషికొండ దగ్గరకు వెళ్తే ఉత్తరాంధ్రను రక్షించినట్లు అవుతుందా అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.