తెలుగుదేశం దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకున్నాక రోజా చాలా పెద్దవారయిపోయారు. వీలున్నంత వరకూ అక్కడ నేర్చిన పొలిటికల్ టెక్నిక్స్ నే అంతటా ఉపయోగించే ఆమె తరుచూ విపక్ష నేతలో ఉన్న చంద్రబాబును తిడుతుంటారు. ఆయన పేరు చెబితే చాలు శివంగి అయిపోతారు. శివాలెత్తేస్తారు. రోజా ఎక్కడి నుంచి ఎదిగివచ్చారో అన్నది మరిచిపోయారు అన్నది ఓ వాదన. ఇప్పుడు మళ్లీ రోజా వార్తల్లో నిలిచారు. ఖరీదయిన కారు కొనుగోలుకు కోట్లు వెచ్చించారన్నది టీడీపీ ఆరోపణ.
టూరిజం శాఖ కు మంత్రివర్యులుగా ఉన్న ఆమె ఇప్పటిదాకా కీలకం అయిన నిర్ణయాలు తీసుకున్న దాఖలాలే లేవు అని, కానీ రిషికొండ పై నిర్మాణాలకు మాత్రం ఆమె తనవంతు సహకారం అందిస్తున్నారని, నిబంధనలకు వ్యతిరేకంగా కొందరు ప్రయివేటు వ్యక్తులు చేపడుతున్న కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులకు తనవంతు ఊతం ఇస్తున్నారని ఎప్పటి నుంచో టీడీపీ ఆరోపిస్తూ వస్తోంది.
కానీ తాను ఏ తప్పూ చేయలేదు అని సినిమా హీరోయిన్ గా ఉన్నప్పుడే కోట్లు సంపాదించానని, అదేవిధంగా ప్రొడక్షన్ లో బోలెడు డబ్బు పోగొట్టుకున్నానని రోజా అంటుంటారు. అదేవిధంగా ఇప్పుడు కూడా అదే మాట చెబుతూనే మరో మాట యాడ్ చేశారు. తన దగ్గర ఉన్న ఐటీ రిటర్న్స్ ఫైల్స్ అన్నీ మీకు ఇచ్చేస్తానని తెలుగుదేశం నేతలకు చెప్పారు.
తాను సినిమాలలో డబ్బులు పోగొట్టుకున్నాక జబర్దస్త్ అనే షో ద్వారా లక్షల్లో రెమ్యునరేషన్ సంపాదించానని, తనను ఆర్థికంగా ఆదుకున్నదే మల్లెమాల సంస్థ అని పదే పదే చెబుతూ ఇదే సందర్భంలో తాను కారు కొనుక్కోలేని స్థోమత లేని దానిని అయితే కాదని స్పష్టం చేస్తున్నారు.
ఇదంతా బాగుంది రోజా రాజకీయాల్లో ఉంటే బూతులు తిడతారు అని, అదే టెలివిజన్ షోలో ఉంటే, వాటిని హోస్ట్ చేస్తే బూతులు విని నవ్వుతారు అని ఆమెను ఉద్దేశించి కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు మండిపడుతున్నారు.
టూరిజం శాఖను నిర్వహిస్తున్న తీరు కూడా బాలేదని, ఇప్పటిదాకా ఇంకా ఆమె జబర్దస్త్ జడ్జ్ మాదిరిగానే ఉన్నారని, ఆ పాత్ర నుంచి బయటకు వస్తే మంత్రి పాత్రకు న్యాయం చేస్తారని, అంటే క్రియాశీలకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు ఇతర అధికారులు చెబితే అదే వింటున్నారు అని, వాస్తవాలు ముఖ్యంగా రూల్ పొజిషన్ అన్నది ఆమెకు తెలియడం లేదని టీడీపీ ఫైర్ అవుతోంది.