భారత జాతీయ గీతం సృష్టికర్త, నోబెల్ బహుమతి గ్రహీత, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. కోల్ కతాలోని రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి యూనివర్సిటీని సందర్శించిన కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ తాజాగా విశ్వకవి ఠాగూర్ పై నోరుజారారు. ఠాగూర్ నల్లగా ఉండడంతో తల్లి సహా కుటుంబంలోని అందరి నిరాదరణకు గురయ్యారని వ్యాఖ్యానించారు.
‘ఠాగూర్ ను ఆయన తల్లి, కొంతమంది బంధువులు నల్లగా ఉండడం వల్ల వివక్ష చూపారు. ఆయనను తమ చేతుల్లోకి తీసుకోలేదు’ అని కేంద్రమంత్రి నోరుజారారు. ‘కుటుంబంలోని మిగతా వారి కంటే ఠాగూర్ నల్లగా ఉండేవారు. ఇక్కడ రెండు రకాల రంగులున్న వ్యక్తులు ఉన్నారు. పసుపు రంగులో మెరిసిపోయేవారు కొందరు.. ఇంకొందరు ఎరుపురంగులో ఉండేవారు.. విశ్వకవి రెండో వర్గానికి చెందిన వారు’ అని మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అవమానించేలా మాట్లాడారాన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆ కుటుంబంలోనే రవీంద్రుడు వివక్షను ఎదుర్కొన్నాడని తెలిపారు.
ఈ వ్యాఖ్యలపై మేధావులు, విద్యావేత్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. అటు రాజకీయంగానూ విమర్శలు వెల్లువెత్తాయి. విద్యాశాఖ మంత్రి అజ్ఞానానికి ఇది నిదర్శనమని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
విశ్వకవి పెద్ద సోదరి ఆయనను మా ముదురు రంగు అబ్బాయి రబీ అని వర్ణించారని.. ఇది కేవలం అతిశయోక్తి అని.. కానీ రవీంద్రనాథ్ నల్లగా ఉంటారని చెప్పడం మంత్రి ఉద్దేశమా? అని విశ్వభారతి వైఎస్ చాన్సలర్ పవిత్రా సర్కార్ మండిపడ్డారు.
అటు మంత్రి వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగాల్ ఐకాన్ ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని మండిపడింది. మంత్రి సుభాష్ సర్కార్ కు రవీంద్రనాథ్ ఠాగూర్ చరిత్ర తెలియదని మండిపడింది.