మోడీ షాకింగ్ నిర్ణ‌యం.. ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల‌కు మ‌న మంత్రులు

Update: 2022-02-28 08:29 GMT
ఉక్రెయిన్- రష్యాల మ‌ధ్య నాలుగు రోజులుగా జ‌రుగుతున్న‌ యుద్ధం  భీక‌ర స్థాయికి చేరుకుంటున్న సంకేతాలు వ‌స్తున్నాయి. ర‌ష్యాకు స‌హ‌క‌రించేందుకు బెలార‌స్ దేశం కూడా యుద్ధంలోకి అడుగులు వేస్తోంది. మ‌రో వైపు.. ఉక్రెయిన్‌కు అనుకూలంగా యూర‌ప్ దేశాలు కూడా యుద్ధానికి కాలుదువ్వుతు న్నాయి. ఈ నేప‌థ్యంలో ర‌ష్యా, ఉక్రెయిన్‌ల మ‌ధ్య యుద్ధం ప‌తాక స్థాయికి చేరుకునే ప‌రిణామాలు క‌ళ్ల‌కు క‌డుతున్నాయి.

ఈనేపథ్యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను తరలించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపించనుంది. ఈ మేరకు నలుగురు కేంద్ర మంత్రులు హర్దీప్సింగ్ పూరి, జ్యోతిరాధిత్య సింథియా, కిరెణ్ రిజిజు, వీకే సింగ్ ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లనున్నారు.

ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన సోమవారం జరిగిన అత్య‌వ‌స‌ర‌ అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, కేంద్ర మంత్రి పీయుష్ గోయల్తోపాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

ఉక్రెయిన్లోని పరిణామాలపై గ‌త రెండు రోజులుగా ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించా రు. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటివరకు ఐదు విమానాల్లో ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించారు అధికారులు. తాజాగా ఐదో విమానంలో 249 మంది విద్యార్థులు భారత్కు వచ్చారు. ఇంకా దాదాపు 16వేల మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వీరిని కూడా హుటాహుటిన దేశానికి ర‌ప్పించేందుకు మోడీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుందికేంద్ర మంత్రుల‌ను అక్క‌డ‌కు పంపించ‌డం ద్వారా చ‌ర్య‌ల‌ను మ‌రింత వేగం చేయాల‌ని భావిస్తోంది. త‌ద్వారా.. మొత్తం భార‌తీయుల‌ను ఉక్రెయిన్ నుంచి ర‌ప్పించే చ‌ర్య‌ల‌కు శ్రీకారం చుట్టింది.
Tags:    

Similar News