వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ మాటే శాసనం. ఆయన చెప్పిన మాటను జవదాటితే ఇక వారికి మూడినట్టే. సేమ్ కేసీఆర్ లాంటి వైఖరి జగన్ లోనూ ఉంది. అందుకే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎవరు ఎదురుచెప్పరు. కానీ స్థానిక ఎన్నికల నేపథ్యంలో జగన్ మాటను మంత్రులు లెక్క చేయడం లేదు. జగన్ చెప్పిన మాటను పక్కకు పెట్టేసి మంత్రులు రాజకీయం చేస్తున్నారు. ఈ పరిణామం ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రయ్యాక, కాకముందు కూడా పార్టీలో జగన్ నిర్ణయమే ఫైనల్. అదే వైఖరి ఇప్పుడు కూడా కొనసాగుతోంది. అయితే తాజాగా స్థానిక ఎన్నికల సందర్భంగా మంత్రులు జగన్ మాటను కొంచెం పక్కకు జరిపి వ్యవహారం నడిపిస్తున్నారు. అదేమిటంటే ఎన్నికల్లో కుటుంబసభ్యులకు అవకాశం వద్దు అని జగన్ ఆదేశించారంట.
దీన్ని మంత్రులు పట్టించుకోలేదని పరిణామాలు చూస్తుంటే తెలుస్తోంది. ఎమ్మెల్యేలు.. మంత్రులు, పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్, కీలక నాయకుల కుటుంబసభ్యులు, బంధువులు ఎవరూ కూడా స్థానిక ఎన్నికల బరిలో నిలవద్దని జగన్ ఆదేశించారు. ఒకవేళ అలా నిలిచిన వారికి బీ ఫామ్ లు ఇవ్వొద్దని జగన్ తేల్చిచెప్పారు. అయితే వాటిని ఎమ్మెల్యేలు, మంత్రులు ధిక్కరించి తమ వారికి పదవులు ఇప్పించుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్టణంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు - గుంటూరు - శ్రీకాకుళం జిల్లాల్లో వైఎస్సార్సీపీ తరఫున మంత్రులు, -ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు - బంధువులు పోటీ చేశారు. దీన్ని పార్టీ గుర్తించినట్లు సమాచారం. పార్టీ కుటుంబసభ్యులు - బంధువులు ఈ స్థానాల్లో పోటీకి నిలబెట్టారు.. ఆ వివరాలు..
- శ్రీకాకుళం జిల్లా దూసి ఎంపీటీసీ సభ్యురాలిగా స్పీకర్ తమ్మినేని బంధువు తమ్మినేని శారద బరిలో నిలిచారు.
- మంత్రి ధర్మాన కృష్ణదాస్ తన కుమారుడు కృష్ణ చైత్యనను పోలకి జెడ్పీటీసీ అభ్యర్థిగా నిలబెట్టారు.
- పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి తన కుమారుడు రెడ్డి శ్రవణ్ ను పోలకి జెడ్పీటీసీగా బరిలో దించారు.
- విశాఖ జిల్లాలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అనూహ్యంగా తన కుమార్తె ప్రియాంకతో జీవీఎంసీ 6వ వార్డులో పోటీకి నిలిపారు.
- విజయనగరం ఎమ్మెల్యే వీరభద్రస్వామి తన కుమార్తెను కార్పొరేటర్ గా బరిలో ఉన్నారు.
- మంత్రి బొత్స సత్యనారాయణ అల్లుడు చిన్నశ్రీను కార్పొరేటర్ గా నామినేషన్ వేశారు.
- శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓడిన దువ్వాడ శ్రీను ఈసారి తన సతీమణి దువ్వాడ వాణిని స్థానిక ఎన్నికల్లో పోటీకి నిలిపారు.
- ప్రభుత్వ విప్ - మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు కుమార్తె ఈర్లె అనురాధ కె.కోటపాడు జెడ్పీటీసీ స్థానానికి - కుమారుడు రవి దేవరాపల్లి జెడ్పీటీసీకి రెబల్ గా నామినేషన్ వేశారు.
- గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తన కుటుంబం నుంచి ఇద్దరిని కార్పొరేటర్లుగా పోటీకి దింపారు.
- విశాఖ తూర్పు నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల తన తోటికోడలు పద్మతో నామినేషన్ చేయించారు.
మరికొన్ని స్థానాల్లో కూడా ఎమ్మెల్యేలు - మంత్రులు - పార్టీలోని కీలక నాయకుల బంధుమిత్రులు బరిలో ఉన్నారు. ఈ విధంగా పార్టీలోని కీలక వ్యక్తులే జగన్ ఆదేశాలను ధిక్కరించడం గమనార్హం. అయితే ఈ వ్యవహారాన్ని జగన్ గుర్తించారంట. నామినేషన్ ఉప సంహరణ గడువు ఉండడంతో వారితో ఉప సంహరించుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విధంగా తన మాటను లెక్క చేయని వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.