ఏ ఫోన్ కాల్ వచ్చినా తన బిడ్డే అనుకొని ఆ తల్లి ఉలిక్కి పడుతోంది.. కొత్తవారు ఇంటికొస్తే తన కుమారుడే కావొచ్చని అనుకుంటోంది.. కడుపు చించుకొని పుట్టిన కన్నపేగు కనిపించక ఎన్నో నెలలు అవుతోంది.. ఒక్కసారి కనిపిస్తే చాలు.. నా జన్మ ధన్యమవుతుందని ఎదురుచూస్తున్న ఆ తల్లికి దిన దినం గండంగా మారుతోంది.
నెల రోజుల కిందట తప్పిపోయిన తన కుమారుడి ఆచూకీ కోసం ఆ తల్లితో పాటు సోదరుడు తీవ్ర ప్రయత్నాలు చూస్తున్నాడు. సాహస యాత్ర కోసం ఏప్రిల్ 26న అజర్ బైజాన్ వెళ్లిన భారతీయుడు తప్పిపోయాడు. మే 12 వరకు టచ్ లో ఉన్న మణికాంత్ ఆ తరువాత కాంటాక్టు కావడం లేదని అతని సోదరుడు సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేస్తున్నాడు.
ఇన్ స్ట్రాగ్రాంలోని ‘హ్యూమన్ ఆఫ్ బాంబే’ పేజీలో మణికాంత్ సోదరుడు ధరన్ తన తమ్ముడి గురించి వివరాలు రాశాడు. ‘మీరు ఈ ఫొటోలో చూస్తున్న వ్యక్తి పేరు మణికాంత్. రెండు వారాలుగా అతడు మాకు కాంటాక్ట్ కావడం లేదు. అతడు ఎక్కడున్నాడో తెలియక మా కుటుంబ సభ్యులంతా నిద్రాహారాలకు దూరమవుతున్నాం’ అని పోస్టు చేశాడు.
ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ధరన్ మాట్లాడుతూ మనికాంత్ నాకు సోదరుడే కాదు ఆత్మీయ మిత్రుడు. అతనికి సాహస యాత్రలు చేయడం అంటే చాలా ఇష్టం. ఇందుకోసం అజర్ బైజాన్ వెళ్లాడు. ప్రయాణానికి ఒకరోజు ముందు ఢిల్లీ ఎయిర్ పోర్టులో డ్రాప్ చేశాను.
ఏప్రిల్ 26న ఫ్లైట్ ఎక్కిన మణికాంత్ మే 12 వరకు మాతో కాంటాక్టులోనే ఉన్నాడు. అదే రోజు చివరి సారిగా రాత్రి 7 గంటలకు మాట్లాడిన అతడి ఆచూకీ తరువాత దొరకలేదు. నేను మెసేజ్ చేశా.. కానీ అది డెలివరీ కాలేదు. దీంతో చాలా భయం వేసింది. అక్కడ నెట్ వర్క్ సమస్య ఉండొచ్చని అనుకున్నా. ఆ తరువాత చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో అజర్ బైజాన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించాం. కొండ ప్రాంతాలు ఉండడం వల్ల అక్కడి సిగ్నల్ ఉండకపోవచ్చని అన్నారు. ఆ తరువాత మళ్లీ మళ్లీ ఫోన్ చేయడంతో ఆయన కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
మా రాష్ట్ర సీఎం నుంచి పీఎం వరకు అందరినీ సంప్రదించాం. మణి కాంత్ జాడ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాం. అయినా కాస్త ఆచూకీ దొరకడం లేదు. ప్రతీ ఫోన్ కాల్ తో మా అమ్మ ఉలిక్కి పడుతోంది. మణికాంత్ చేశాడనుకొని ఫోన్ తనే తీసుకుంటోంది. మణికాంత్ ఏం కాదని క్షేమంగా తిరిగి వస్తాడని అనుకుంటున్నాం. ఇందులో భాగంగా ఆయన గురించి తెలియగానే మాకు సమాచారం ఇవ్వడానికి మణికాంత్ ఫొటోలను షేర్ చేసి సర్క్యలేట్ చేస్తున్నాం.. అని ధరన్ సోషల్ మీడియా వేదికగా అభ్యర్థిస్తున్నాడు. అంతేకాకుండా change.orgలో తాము చేపట్టిన సంతకాల సేకరణకు మద్దతు పలకాలని కోరుతున్నాడు.