ఏపీ రాజకీయాల దెబ్బకు సర్వే సంస్థలూ జడుసుకుంటున్నాయి. తమ పేరిట వస్తున్న ఫేక్ సర్వేలతో ఆయా సంస్థలు పదేపదే వివరణలు ఇచ్చుకోకతప్పడం లేదు. అలాగే తామే సర్వేలూ చేయడం లేదని మరికొన్ని వార్తా సంస్థలూ మొత్తుకుంటున్నాయి. అయినా ఫేక్ సర్వేలు మాత్రం ప్రవాహంలా వచ్చి పడుతున్నాయి. తాజాగా టీడీపీకి 101 సీట్లు వస్తాయంటూ నిన్న ఏబీఎన్, పలు ఇతర చానళ్లలో ప్రసారం కావడంతో పాటు సోషల్ మీడియానూ ఓ సర్వే ముంచెత్తింది. ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో అందులో చెప్పుకొచ్చారు. జిల్లాలవారీగా సీట్లనూ అంచనా వేశారు. కార్పొరేట్ చాణక్యతో పాటు ఏబీఎన్ ఆ సర్వే చేసినట్లు ప్రచారమైంది. కానీ... ఇంతవరకు టుడేస్ చాణక్య అనే సర్వే సంస్థ మాత్రమే ప్రజలకు తెలియడంతో ఏపీలోని విపక్ష పార్టీ నేతలు, పార్టీ మద్దతు దారులు నిన్నటి సర్వేను ఫేక్ సర్వేగా చెప్పారు. అయితే.. ఈ సర్వేలో పాలుపంచుకున్నట్లు చెప్పుకొన్న ఏబీఎన్ మాత్రం కార్పొరేట్ చాణక్య హైదరాబాద్ బేస్డ్ సంస్థ అంటూ తన వార్తలో చెప్పింది. కానీ... తాజాగా మరో మలుపు తిరిగింది ఈ వ్యవహారం.. మిషన్ చాణక్య అనే సంస్థ నిన్నటి సర్వే రిపోర్టును ఖండిస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్లుగా సోషల్ మీడియాలో ఆ నోట్ సర్క్యులేట్ అవుతోంది ఇప్పుడు.
అందులో... ఏబీఎన్ చానల్ తమ సంస్థ పేరును దుర్వినియోగం చేసిందని.. మిషన్ చాణక్య పేరును దుర్వినియోగం చేస్తూ, ప్రతిష్ట దెబ్బతీస్తూ కార్పొరేట్ చాణక్య అనే పేరు మార్చి తప్పుడు సర్వే ఫలితాలను ప్రసారం చేసిందని అందులో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి పత్రికలో ఎవరీ కార్పొరేట్ చాణక్య అని ప్రచురించిన వివరాలు మిషన్ చాణక్య సంస్థ ట్రాక్ రికార్డు అని.. తమ సంస్థ ఘనతను కార్పొరేట్ చాణక్య అనే లేని సంస్థకు ఆపాదించి తమ ప్రతిష్ఠ దిగజార్చారని అందులో ఖండించారు.
ఏపీ ఎన్నికలపైనా సర్వే చేస్తున్నామని.. కానీ, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చివరి ఫేజ్ పోలింగ్ అనంతరం దాన్ని విడుదల చేస్తామని అందులో పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి తప్పుడు వివరాలు ప్రచురించిందంటూ ఖండించారు. మిషణ్ చాణక్య సీఈవో శివకేశవన్ పేరిటి ఈ నోట్ రిలీజ్ చేశారు.
దీంతో ఇప్పటికే నిన్నటి నుంచి ఆ సర్వే ఫలితాలు ఫేక్ అని వాదిస్తున్న వైసీపీ, సాక్షిలు ఈ విషయాన్ని ప్రజలకు చేర్చే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే.. పోలింగ్ సమీపిస్తున్న వేళ ఎలాగైనా టీడీపీ గెలవనుందన్న అంచనాలను వివిధ మార్గాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ ఇంకా ప్రయత్నిస్తోంది. దీంతో ప్రజలు నిజమైన సర్వేలనూ నమ్మే పరిస్థితిలో లేకుండా పోయింది.