ఏపీకి ప్రత్యేక హోదా కోసం సాగుతున్న ప్రస్తుతం ఉద్యమంలో రోజుకో కొత్త పరిణామం చోటుచేసుకుంటోంది. ఏపీలో విపక్ష పార్టీగా వైసీపీ ఆది నుంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యమంలో భాగంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందన్న విషయంపై విద్యార్థులు, యువతకు అవగాహన కలిగించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయా జిల్లా కేంద్రాల్లో యువభేరీల పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ భేరీలకు యువత పోటెత్తిన వైనాన్ని చూసిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే తరహా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని, అసలు ప్రత్యేక హోదా రాదని, ప్రత్యేక హోదా కంటే కూడా రాష్ట్రానికి మరింతగా ప్రయోజనం చేకూర్చే ప్రత్యేక ప్యాకేజీనే నయమని, ఇకపై ప్రత్యేక హోదా అంటే జైల్లో పెట్టేస్తామని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హెచ్చరికలు జారీ చేసిన వైనాన్ని కూడా జనం ఇప్పుడు బాగానే గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే... నాలుగేళ్లుగా బీజేపీతో కలిసి సాగిన టీడీపీ... ఇప్పుడు విపక్షం వైసీపీ ప్రత్యేక హోదా కోసం తనదైన శైలిలో పోరాటాన్ని ప్రకటించడంతో పాటు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏకంగా రాజీనామాలు కూడా చేస్తామని ఆ పార్టీ ఎంపీలు ప్రకటించిన నేపథ్యంలో అనివార్యంగా టీడీపీ కూడా ఇప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తన భుజాలపైకి ఎత్తుకోక తప్పలేదన్న వాదన వినిపిస్తోంది.
ఈ క్రమంలో మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానానికి తాము రెడీ అంటూ వైసీపీ ప్రకటిస్తే... రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు పలుకుతామని చంద్రబాబు ప్రకటించారు. అయితే అంతలోనే ఏమైందో తెలియదు గానీ... వైసీపీ తీర్మానానికి తాము మద్దతివ్వబోమని, తామే స్వయంగా మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టేస్తామని బాబు అండ్ కో కొత్త ప్రకటన చేసేసింది. మొత్తంగా అటు వైసీపీతో పాటు ఇటు టీడీపీ కూడా మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టాయి. ఆ తర్వాత రాష్ట్ర విభజనకు కర్త, కర్మ, క్రియగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా మోదీ సర్కారుపై అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ తీర్మానాలేవీ పారచ్లమెంటులో చర్చకు రాకుండా ఉండేలా బీజేపీ రచించిన వ్యూహం ప్రకారం... అన్నాడీఎంకే ఎంపీలు కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ రోజూ రచ్చ చేయడం, సభ ఆర్డర్‌లో లేదంటూ స్పీకర్ సభను వాయిదా వేస్తుండటం తెలిసిందే.
ఈ క్రమంలో తాము ముందుగా ప్రకటించిన మేరకు ఏప్రిల్ 6న ఎంపీ పదవులకు రాజీనామాలు చేస్తామని వైసీపీ ఎంపీలు మరోమారు ప్రకటించారు. ఈ మేరకు నేటి మధ్యాహ్నం మీడియా ముందుకు వచ్చిన వైసీపీ యువ ఎంపీ, కడప జిల్లా రాజంపేట లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి... టీడీపీ సర్కారుకు - ప్రధానంగా సీఎం చంద్రబాబుకు ఓ గట్టి సవాల్ విసిరారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ సర్కారుపై అవిశ్వాస తీర్మానాలు ఎలాగూ చర్చకు రావడం లేదు... ఇక ఎంపీ పదవులకు రాజీనామాలు చేయడం ద్వారా దేశంలో ప్రకంపనలు సృష్టించడం ఒక్కటే మిగిలిందని ఆయన చెప్పారు. ఈ రాజీనామాల్లో భాగంగా ముందుగా ప్రకటించిన మేరకు తామంతా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 25 మంది ఎంపీలు ఒకేసారి రాజీనామా చేస్తే... దేశంలో ప్రకంపనలు రేగడం ఖాయమేనని ఆయన తేల్చేశారు.
మరి ఇలా దేశంలో ప్రకంపనలు సృష్టించడం ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, మరి ఎంపీల రాజీనామాలకు మీరు సిద్ధమేనా? అని ఆయన చంద్రబాబుకు సూటిగానే సవాల్ విసిరారు. రాజీనామాల ద్వారా ఉపఎన్నికలు వస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని, రాజస్థాన్ - కర్ణాటకలోనూ అలాగే జరిగిందని మిథున్ రెడ్డి గుర్తు చేశారు. వైఎస్ జగన్ అవిశ్వాస తీర్మానం ప్రకటించడమే కేంద్రాన్ని ఒక కుదుపు కుదిపిందన్నారు. జగన్ ముందడుగు వల్లే ఈరోజు మిగతా పార్టీలు కూడా ఆ దిశగా కదిలాయని అన్నారు. ఒకవేళ టీడీపీ ఎంపీలు గనుక రాజీనామాలు చేయకపోతే ఆ పార్టీ బీజేపీతో లాలూచీ పడినట్టుగానే భావించాల్సి వస్తుందని ఆయన తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదాపై తామైతే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని, ముందుగా ప్రకటించినట్లే తాము ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామన్నారు. తమకంటే ముందు టీడీపీ ఎంపీలు రాజీనామా చేసిన తమకేమి అభ్యంతరం లేదని మిథున్ రెడ్డి చాలా విస్పష్టంగా తమ పార్టీ వైఖరిని ప్రకటించేశారు. మరి మిథున్ రెడ్డి సవాల్ కు టీడీపీ ఏ రకంగా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారిందని చెప్పాలి.