షెడ్యూల్ లో పేర్కొన్న దాని కంటే రెండు రోజుల ముందే ముగిశాయి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. చివరి రోజైన బుధవారం లోక్ సభలో ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. లోక్ సభలో తెలుగుకు ఉండే ప్రాధాన్యత ఎంతన్నది తెలిసిందే. అలాంటిది తెలుగులో ఒక ఎంపీ అనూహ్యంగా అభ్యర్థించటం.. ఆ సందర్భంలో ప్యానెల్ స్పీకర్ గా వ్యవహరిస్తున్న మిథున్ రెడ్డి మరో నిమిషం సమయాన్ని అదనంగా ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ తెలుగులో తనకు అదనపు సమయాన్ని ఇవ్వాలని రిక్వెస్టు చేసిన మహిళా ఎంపీ ఇంకెవరో కాదు.. టాలీవుడ్ చిత్రాల్లో నటించిన నవనీత్ కౌర్.
పలు తెలుగు సినిమాలతో పాటు టీవీ షోల్లో పాల్గొన్న నవనీత్.. ప్రస్తుతం మహారాష్ట్రలోని ‘అమరావతి’ ఎంపీ స్థానానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆమె విజయం సాధించారు. చర్చల్లో చురుగ్గా పాల్గొనే నవనీత్..తాజాగా ఓబీసీ బిల్లుపై జరుగుతున్న చర్చ సందర్భంగా ఆమె కూడా మాట్లాడారు. ఆ సమయంలో ప్యానెల్ స్పీకర్ గా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (రాజంపేట) వ్యవహరిస్తున్నారు. నవనీత్ హిందీలో తన ప్రసంగాన్ని ప్రారంభించి నిమిషం అయిందో లేదో సమయం అయిపోతుందని బెల్ మోగించారు.
దీంతో నవనీత్.. సార్ నాకు రెండు నిమిషాలు సమయం ఇవ్వండన్నారు. తాను ఇండిపెండెంట్ సభ్యురాలినని.. ఏ పార్టీకి చెందిన కానిదానినని ఇంగ్లిషులో అడిగారు. ఇంకా మాట్లాడాల్సిన సభ్యులు ఆరుగురు ఉన్నారని.. ఉన్నది పన్నెండు నిమిషాలేనని చెప్పిన ఆయన రెండు.. మూడు నిమిషాల్లో ముగించాలన్నారు. తనకు మళ్లీ బెల్ కొట్టే పరిస్థితిని తీసుకురావొద్దన్నారు.
అయితే.. ఆమె ప్రసంగం మొదలు పెట్టిన నిమిషానికే ఆయన మరోసారి బెల్ కొట్టారు. మరో సభ్యుడి పేరును పిలిచారు. దీంతో.. తనకు మరో 30సెకన్లు ఇవ్వాలని కోరటమే కాదు.. ‘మీరు తెలుగు మాట్లాడే సభ్యులు. నేను కూడా తెలుగు మాట్లాడతాను.. మీరు ఛైర్ లో ఉన్నారు కనుక నాకు మరో నిమిషం మాట్లాడే ఛాన్సివ్వండి’ అని కోరటంతో మిగిలిన సభ్యులు ఆశ్చర్యపోయారు. ఆమె అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన మిథున్ రెడ్డి.. మరో నిమిషం అదనపు సమయాన్ని ఇచ్చారు.
ఈ సందర్భంగా స్పందించిన ఆమె.. నా నేపథ్యాన్ని గుర్తించారు. నేను మహారాష్ట్రకు చెందినదానిని. అందుకు గర్వపడతాను. కానీ నేను ఏపీ.. తెలంగాణల రాష్ట్రాలకు చెందిన దానినే. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ ముగించారు. తెలుగు అస్త్రాన్ని సంధించిన నవనీత్ తీరు అందరిని ఆకర్షించింది.