దక్షిణాది రాష్ట్రాల్లో మిగిలిన ముఖ్యమంత్రులతో పోలిస్తే.. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ మీద తరచూ ప్రశంసలు కురవటమే కాదు.. ఆయన వ్యవహరిస్తున్న తీరుపై తరచూ చర్చ జరుగుతున్న పరిస్థితి. ప్రధాని మోడీ అంటే వ్యతిరేకత ఉన్నా.. ఆయన రాష్ట్రానికి వచ్చిన వేళలో వ్యక్తిగత.. రాజకీయ వైరాన్నివదిలేసి.. ప్రోటోకాల్ తూచా తప్పకుండా పాటించటం.. అదే సమయంలో వేరే వేదికల మీద మోడీ సర్కారు నిర్ణయాలపై మండిపాటును ప్రదర్శించటం లాంటివి చేయటం తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా తమిళనాడు అసెంబ్లీలో స్టాలిన్ ప్రభుత్వం ఆమోదించిన బిల్లుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బిల్లులోని అంశాలు షాకింగ్ గా మారాయి. ప్రస్తుతం ప్రైవేటు కంపెనీలు.. కర్మాగారాల్లోని ఉద్యోగులు, కార్మికులు రోజుకు ఎనిమిది గంటల పాటు పని చేస్తుండగా.. ఇకపై 12 గంటలు చొప్పున పని గంటలు నిర్ణయిస్తూ ప్రత్యేక బిల్లుకు ఆమోదాన్ని తెలిపారు. దీనిపై విపక్షాలతోపాటు ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ బిల్లును ప్రతిపక్ష సభ్యులే కాదు.. పాలక వర్గానికి చెందిన సభ్యులు కూడా వ్యతిరేకించటం గమనరా్హం.
ఈ బిల్లుపై రచ్చ సాగుతున్న వేళ.. మెజార్టీతో ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసినట్లుగా స్పీకర్ అప్పావు ప్రకటించారు. ఈ ప్రత్యేక బిల్లుపై పరిశ్రమల శాఖ మంత్రి తంగం తెన్నరసు మాట్లాడుతూ.. విదేశీ సంస్థలు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టటానికి సిద్ధంగా ఉన్నాయని.. కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలు.. ఫ్యాక్టరీలలో అధిక ఉత్పత్తికి అనుగుణంగా కొత్త చట్టాన్ని తెస్తున్నట్లు చెప్పారు.
ఈ బిల్లుపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను కార్మిక మంత్రి గణేశన్ కొట్టి పారేస్తున్నారు. ప్రస్తుతానికి వారానికి 48 గంటలు పని చేస్తున్నారని.. ఇప్పుడుకూడా అవే గంటలు కాకుంటే నాలుగు రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఐదో రోజు నుంచి కార్మికులు పని చేసేందుకు ఇష్టపడితే.. వారు పని చేసిన పని గంటలకు అదనంగా చెల్లింపులు జరుపుతారని చెబుతున్నారు. అన్ని కర్మాగారాలకు.. కంపెనీలకుఈ చట్టం వర్తించదని.. కంపెనీలు.. కర్మాగారాలు ఇష్టపడితేనే ఈ చట్టాన్ని వర్తించుకునే వీలుందన్నారు.
అయితే.. ఈ పని గంటల పెంపుచట్టం కార్పొరేట్ సంస్థలకు.. కంపెనీలకు మాత్రమే లాభం చేకూరేలా చేస్తందని విపక్షాలు మండిపడుతున్నాయి. చట్టంలోని అంశాలన్నింటినిఎవరూ పాటించరని..తమకు అనుకూలంగా ఉన్న అంశాల్ని తమ ఉద్యోగులు, కార్మికుల చేత చేయిస్తాయని.. ఈ కొత్తచట్టంతో శ్రమదోపిడీ అధికమవుతుందని చెబుతున్నారు. ఈచట్టం కర్మాగారాల యజమానులకు మాత్రమే లాభం చేస్తుందే తప్పించి కార్మికులకు మాత్రం చేయదంటున్నారు.
రోజుకు పన్నెండు గంటలు పని అయితే.. ఏడెనిమిది గంటలు నిద్ర.. రెండు గంటలు ప్రయాణానికి సమయాన్ని వెచ్చిస్తే.. అసలురోజు మొత్తంలోటైం ఉండని పరిస్థితి. యంత్రాల మాదిరి కార్మికులు.. ఉద్యోగులు తయారవుతారు. ఇంత దారుణమైన చట్టాన్ని స్టాలిన్ సర్కారు ఎలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు సానుకూలతతో నెట్టుకొస్తున్న స్టాలిన్ సర్కారుకు ఈ కొత్త చట్టంతో షాకులు తప్పవన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.