పళని ఓకే కానీ..15 రోజులు వద్దంటున్నాడు

Update: 2017-02-16 14:15 GMT
ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠతో నాన్ స్టాప్ గా సాగిన తమిళ ఎపిసోడ్ ముగిసినట్లే. పళనిస్వామిని సీఎంగా ప్రమాణస్వీకారోత్సవానికి గవర్నర్ ఆహ్వానించటం.. ఆయన ప్రమాణస్వీకారం చేయటంతో ఒకకార్యక్రమం పూర్తి అయ్యింది. గవర్నర్ నిర్ణయాన్ని తమిళనాడు విపక్ష నేత స్టాలిన్ స్వాగతించారు. అయితే.. గవర్నర్ తీసుకున్న మరో నిర్ణయంపై మాత్రంఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పళనిస్వామికి అనుమతిచ్చిన గవర్నర్.. ఆయన్ను అసెంబ్లీలో బలనిరూపణ కోసం పదిహేను రోజుల సమయాన్ని ఇవ్వటం తెలిసిందే. ఈ గడువుపై స్టాలిన్ అసంతృప్తి వ్యక్తం చేశారు గవర్నర్ తన నిర్ణయాన్ని ఆలస్యంగా ప్రకటించినప్పటికీ స్వాగతిస్తున్నామని.. కానీ.. బల నిరూపణ కోసం మరీ ఇంత సమయం ఇవ్వాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇంత గడువు ఇవ్వటం వల్ల అక్రమాలకు అవకాశం ఉంటుందని.. పళని.. పన్నీర్ వర్గానికి మధ్య అధిపత్య పోరు జరిగే వీలున్న నేపథ్యంలో.. బల నిరూపణకు ఎక్కువ గడువు ఇవ్వద్దన్న మాటను చెప్పారు. ఒకసారి మాట చెప్పిన తర్వాత మార్చలేరు కదా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News