విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు నెత్తిన బరువు పెట్టారా లేక వరం ఇచ్చారా. ఇది ఆయనతో పాటు పార్టీ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. విశాఖ జిల్లా కొత్త స్వరూపం చూస్తే కనుక అవంతి కచ్చితంగా అయిదేళ్ల మంత్రే. మరో ఆల్టర్నేషన్ లేదు. కానీ చిత్రంగా అనకాపల్లి జిల్లాకు రెండు మంత్రి పదవులు ఇచ్చిన హై కమాండ్ విశాఖను మాత్రం సైడ్ చేసేసింది.
దానికి రీజన్ ఏంటంటే ఆరు అసెంబ్లీ సీట్లతో ఏర్పాటైన విశాఖ జిల్లాలో నాలుగు ఈ రోజుకీ టీడీపీ చేతిలో ఉన్నాయి. కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా టీడీపీ మూడవ వంతు కార్పోరేటర్లను గెలుచుకుంది. వైసీపీ గెలిచిన భీమిలీ, గాజువాకలోనూ టీడీపీ బలంగానే ఉంది. టోటల్ గా చెప్పాలీ అంటే వైసీపీకి విశాఖలో ఈసారి ఎదురీతే. ఆరుకు ఆరు సీట్లను టీడీపీ గెలుచుకున్నా ఆశ్చర్యం లేదు అన్న మాట ఉంది.
ఇదిలా ఉంటే మంత్రి పదవి రేసులో చివరి దాకా ఉండి చాన్స్ కోల్పోయిన అవంతి శ్రీనివాస్ చాలా నిరాశలో ఉన్నారు. దాంతో విశాఖ టూర్లో తన వద్దకు ఆయన్ని పిలిపించుకున్న జగన్ బుజ్జగించారు. పార్టీలో కీలకమైన స్థానం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. దానిలో భాగంగా ఆయనకు విశాఖ జిల్లా ప్రెసిడెంట్ పదవిని అప్పగించారు. అయితే ఈ పదవి పట్ల అవంతి ఏమంత ఆనందంగా లేరని టాక్ నడుస్తోంది.
విశాఖ జిల్లాకు ఇంతకు ముందు ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. కాపులు, యాదవులు ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో బలమైన వర్గాలను వైసీపీ వైపు మళ్ళించడానికి అవంతి శ్రీనివాస్ కి బాధ్యతలు అప్పగించారు. అంతా బాగానే ఉంది కానీ మంత్రిగా తనదైన మార్క్ ని అవంతి వేసుకోలేకపోయారు అన్న విమర్శలు సొంత పార్టీ నుంచే ఉన్నాయి. ఇంకో వైపు చూస్తే ఆయన్ని స్వతంత్రంగా పనిచేయనీయలేదని ఆయన వర్గం చెబుతూ ఉంటుంది.
ఇక మంత్రిగా మరోసారి అవకాశం ఇవ్వడానికి లేదు కానీ ఇపుడు టీడీపీ కంచుకోట లాంటి జిల్లాను బద్ధలు కొట్టడానికి అవంతి పనికివస్తారా అని అనుచరులు రుసరుసలాడుతున్నారు. ఇంకో వైపు చూస్తే విశాఖ జిల్లాలో గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి లాంటి ధీటైన నేతలు ఉన్నారు. ఇక ప్రతీ నియోజకవర్గంలో బలమైన ఎమ్మెల్యేలు టీడీపీకి ఉన్నారు. వారి ధాటిని ఎదుర్కొంటూ వైసీపీని ఇక్కడ గెలిపించడం అంటే కష్టమైన వ్యవహరమే అంటున్నారు.
అదే టైమ్ లో వైసీపీలో గొడ్డులా పనిచేసిన క్యాడర్ అయితే తమకు తగిన గుర్తింపు గౌరవం లేదని మండుతోంది. టీడీపీ నుంచి వచ్చిన వారికే పదవులు నామినేటెడ్ కుర్చీలు ఇచ్చారని కూడా కస్సుమంటోంది. ఇక మంత్రిగా కూడా అవంతికి ఎపుడూ కార్యకర్తలకు చేసింది లేదని అంటున్నారు.
ఆయన ఇపుడు జిల్లా ప్రెసిడెంట్ గా వారిని పనిచేయమంటే చేస్తారా అన్నది పెద్ద ప్రశ్న. మొత్తానికి మంత్రి పదవి అడిగితే పార్టీ బాధ్యతలు నెత్తిన పెట్టారని అవంతి వర్గం గుర్రుమంటోంది. ఇది వరమని వైసీపీ పెద్దలు అంటే అనొచ్చు కాక తమ నేతకు మాత్రం మోయలేని బరువే అని వారు అంటున్నారు. మరి అవంతి ఎపుడు ఫీల్డ్ లోకి దిగుతారో లేక గమ్మున ఉంటారో వేచి చూడాల్సిందే.