బాబుకు మ‌రో షాకిచ్చిన చింత‌మ‌నేని

Update: 2017-04-06 04:22 GMT
బాబు బుజ్జ‌గింపులు త‌మ్ముళ్ల ఆగ్ర‌హాన్ని త‌గ్గించ‌టం లేదు. న‌యానా.. భ‌యానా చెప్పినా లైట్ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ధోర‌ణి ఇప్ప‌టికే పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ కార్య‌క్ర‌మం పూర్తి అయి నాలుగు రోజులు గ‌డిచినా.. ప‌ద‌వులు రాక అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేల్లో ప‌లువు కొర‌క‌రాని కొయ్య‌లుగా మార‌టం.. ఊహించ‌ని రీతిలో షాకుల మీద షాకులు ఇస్తుండ‌టం బాబు బ్యాచ్‌లో క‌ల‌క‌లం రేగుతోంది.

మంత్రి వ‌ర్గంలో స్థానం కోల్పోయిన సీనియ‌ర్ నేత బొజ్జ‌ల‌.. మంత్రి ప‌ద‌వులు ఆశించి భంగ‌ప‌డిన మ‌రో సీనియ‌ర్ నేత బుచ్చ‌య్య చౌద‌రిలు ఎంత‌కూ త‌గ్గ‌ని వైనం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో ప్ర‌భుత్వ విప్‌.. దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ కూడా చేరిపోయారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో త‌ప్ప‌నిస‌రిగా త‌న‌కు అవ‌కాశం ఉంటుంద‌ని బ‌లంగా న‌మ్మిన చింత‌మ‌నేని.. త‌న‌కు అవ‌కాశాన్ని ఇవ్వ‌క‌పోవ‌టాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. మంత్రి ప‌ద‌వి రాని వేళ‌లో త‌న ఆగ్ర‌హాన్ని మిగిలిన వారి కంటే భిన్నంగా ప్ర‌ద‌ర్శించ‌ట‌మే కాదు.. అవ‌స‌ర‌మైతే మ‌రో పార్టీ పెట్టేందుకైనా తాను సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు.

అనంత‌రం.. సీనియ‌ర్ల బుజ్జ‌గింపుల‌తో మెత్త‌బ‌డిన‌ట్లు క‌నిపించారు. ఆపై సీఎం చంద్ర‌బాబును క‌లిశారు. అనంత‌రం.. నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేస్తాన‌ని.. పార్టీకి క‌ట్టుబ‌డి ఉంటాన‌ని.. బాబు నాయ‌క‌త్వంలో ప‌ని చేస్తాన‌ని చాలానే మాట‌లు చెప్పారు. అంత‌లోనే ఏమైందో ఏమో కానీ.. తానెక్కిన అల‌క‌పాన్పు దిగ‌లేద‌న్న విష‌యాన్ని తాజా చ‌ర్య‌తో మ‌రోసారి స్ప‌ష్టం చేశారు చింత‌మ‌నేని. ప్ర‌భుత్వం త‌న‌కిచ్చిన టూ ప్ల‌స్ టూ గ‌న్ మెన్ల‌లో ఇద్ద‌రిని వెన‌క్కి పంపేశారు. త‌న‌కు ఇద్ద‌రు గ‌న్ మెన్లు చాల‌ని.. మిగిలిన ఇద్ద‌రూ అక్క‌ర్లేదంటూ వెన‌క్కి పంపారు.

అయితే.. ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేక‌పోవ‌టంతో.. తిప్పి పంపిన గ‌న్ మెన్లు విధులు నిర్వ‌హించాల‌ని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ప‌ద‌వి రాని నేప‌థ్యంలో త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సైతం సిద్ధ‌మైన చింత‌మ‌నేని.. తాజాగా గ‌న్ మెన్ల‌ను తిప్పి పంప‌టం ద్వారా త‌న నిర‌స‌న‌ను ముఖ్య‌మంత్రికి తెలిసేలా చేశారంటున్నారు. బుజ్జ‌గింపుల ప‌ర్వం పూర్తైన‌ట్లుగా త‌న మీడియాలో పెద్ద పెద్ద అక్ష‌రాల‌తో అచ్చేయించుకున్న చంద్ర‌బాబుకు షాక్ ఇచ్చేలా తాజా ప‌రిణామం ఉందంటున్నారు. ప్ర‌జ‌లే త‌న‌కు ర‌క్ష‌గా ఉంటార‌ని.. అందుకే గ‌న్ మెన్లు అక్క‌ర్లేద‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లుగా ఆయ‌న చెబుతున్నారు. అదే నిజ‌మైతే.. ఇంత‌కాలం ప్ర‌జ‌లు ర‌క్ష‌గా ఉండ‌టం లేదా? అయినా.. న‌లుగురిని ఇస్తే ఇద్ద‌రిని వెన‌క్కి పంపుతూ నిర్ణ‌యం తీసుకోవ‌టం ఎందుకో? అన్న ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి విస్త‌ర‌ణ పుణ్య‌మా అని పుట్టిన అసంతృప్తి మంట‌లు ఇంకా చ‌ల్లార‌లేద‌న్న విష‌యం తాజా ఉదంతం తేల్చిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News