ఏపీ అసెంబ్లీలో కొత్త సభ్యులు కొలువుదీరుతున్నారు. ఇటీవలే ముగిసిన ఎన్నికల్లో మొత్తం 175 నియోజకవర్గాలుంటే... వాటిలో 151 సీట్లు వైసీపీ గెలిస్తే - 23 సీట్లను టీడీపీ దక్కించుకోగా - జనసేన ఓ సీట్లో విజయం సాధించింది. సరే... ఎన్నికలు ముగిశాయి. కొత్త సభ్యులు త్వరలోనే అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలో కొత్త సభలో అడుగుపెట్టనున్న నేతలకు సంబంధించి ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. మొత్తం 175 మందిలో నేరచరితులు ఎంతమంది? క్లీన్ ఇమేజీ ఉన్న వారెంత మంది అన్న వివరాలతో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఓ నివేదికను విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం 175 మంది ఎమ్మెల్యేల్లో 55 మందిపై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయట. అంటే... మూడొంతుల్లో రెండొంతులు... అంటే 32 శాతం మంది నేర చరితులేనన్న మాట. ఇక వీరిలో ఓ 8 మంది దోషులుగా తేలిన వారున్నారన్న సంచలన విషయాన్ని ఏడీఆర్ బయటపెట్టింది. ఇక వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల) తో పాటు మరో పది మంది ఎమ్మెల్యేలపై ఏకంగా హత్యాతయ్నం కేసులున్నాయట. ఆరుగురు ఎమ్మెల్యేలపై మహిళలపై దాడులకు పాల్పడ్డారన్న కేసులు కూడా నమోదయ్యాయట. ఏడుగురిపై కిడ్నాప్ కేసులు కూడా ఉన్నాయట. ఇక పార్టీల వారీగా నేర చరితుల రికార్డుల విషయానికి వస్తే... నేర చరితుల విషయంలో వైసీపీనే అగ్ర స్థానంలో ఉంది.
151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో 50 మంది (33 శాతం)పై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయట. అదే టీడీపీ విషయానికి వస్తే... 23 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో సీరియస్ క్రిమినల్ కేసులున్న వారు నలుగురు మాత్రమేనట. అంటే.. 17 శాతం అన్న మాట. ఇక జనసేన తరఫున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా సీరియస్ క్రిమినల్ కేసులున్న వ్యక్తేనట. ఇక ఆస్తిపాస్లు విషయానికి వస్తే... మొత్తం 175 మంది ఎమ్మెల్యేల్లో 174 మంది కోటీశ్వరులేనట. ఈ విషయంలో ఎమ్మెల్యేల యావరేజీ ఆస్తి రూ.27.87 కోట్లు ఉంటే... టీడీపీ ఎమ్మెల్యేల యావరేజీ రూ.64.61 కోట్లు కాగా - వైసీపీ యావరేజీ రూ.22.41 కోట్లుగా ఉందట. ఇక ఆస్తుల విషయంలో చంద్రబాబు రూ.668 కోట్లతో టాప్ లో నిలిస్తే... రూ.510 కోట్లతో జగన్ రెండో స్థానంలో - రూ.274 కోట్లతో నందమూరి బాలకృష్ణ మూడో స్థానంలో ఉన్నారట.