బ్రేకింగ్ : ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ రాజీనామా!!

Update: 2021-02-06 09:12 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశాఖపట్నం లో ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ ను పూర్తిగా 100 శాతం ప్రైవేటు పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా అయన తన  ఎమ్మె‍ల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అమల్లోకి వచ్చిన  వెంటనే తన రాజీనామాకు ఆమోదం తెలపాలని కోరారు.

ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ శనివారం తన రాజీనామా లేఖ రాశారు. తాను మాటల మనిషిని కానని, చేతల మనిషనని గంటా శ్రీనివాసరావు చెప్పారు. తన నేతృత్వంలోనే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నాన్ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేస్తున్నట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు.

మరోవైపు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఉద్యోగ, కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. వీరికి స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు మద్దతుగా నిలిచారు. అందరూ కలిసి విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించి.. తమ ఆందోళనను చాటిచెప్పారు. ఉద్యమకారుల త్యాగాలను వృథా కానివ్వబోమని, ఎట్టి పరిస్థితిలోనూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కానివ్వబోమని చెప్తున్నారు.
Tags:    

Similar News