తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తల పగిలింది. నిన్న రాత్రి పోలీసులు తోపులాటలో ఆయనపై కూడా దాడి చేశారు. తలకు తీవ్ర గాయం కావడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నాలుగు కుట్లు వేసిన వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారు..
హైదరాబాద్ లోని జుమెరత్ నగర్ లో రాణి అవంతి బాయి చిన్న విగ్రహం ఉండేది. దాని రూపు సరిగా లేదని చాలా పెద్ద విగ్రహాన్ని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తయారు చేయించారు. నిన్న రాత్రి ఊరేగింపుగా తీసుకొచ్చారు.
అయితే ఈ విగ్రహ ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలని ఇప్పటికే పోలీసులు రాజాసింగ్ కు నోటీసులు జారీ చేశారు. లేకపోతే ఏర్పాటుకు అనుమతి ఇవ్వమని అందులో పేర్కొన్నారు. అయితే ఈ ఆదేశాలను లైట్ తీసుకున్న రాజాసింగ్ నిన్న రాత్రి భారీగా హిందుత్వ వాదులతో అతిపెద్ద రాణి అవంతి బాయి విగ్రహాన్ని క్రేన్ సాయంతో ఊరేగింపు గా జుమెరత్ నగర్ కు తీసుకొస్తున్నాడు..
పోలీసులు అక్కడికి చేరుకొని ర్యాలీని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాజాసింగ్ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హిందుత్వ వాదులు రెచ్చిపోయి పోలీసులను పక్కకు తోసేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఇందులో ఎమ్మెల్యేను కూడా కొట్టారు. ఆయన తలపగిలింది.
కాగా పోలీసులు తన తల పగులకొట్టారని.. ఎమ్మెల్యేను అని కూడా చూడకుండా ఇలా ప్రవర్తించారని రాజాసింగ్ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆ పోలీసులపై చర్య తీసుకోవాలని సూచించారు.