తూర్పుగోదావరి జిల్లా రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. రాజోలు నియోజకవర్గంలో పంచాయితీ ఎన్నికల సందర్భంగా ఓ అభ్యర్థి విషయంలో రెండు గ్రూపుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీ కార్యకర్తతో మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది.
పంచాయతీ ఎన్నికల్లో ఓ గ్రామ అభ్యర్థి ఎంపిక విషయంలో వైసీపీ కార్యకర్తను బూతులు తిట్టినట్టు ఆడియో టేప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఆ ఆడియోలో రాజోలు నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన సహదేవ్ అనే వైసీపీ కార్యకర్తతో రాపాక ఫోన్ సంభాషణ సాగింది. 'నా గ్రామానికి వచ్చి వైసీపీ అభ్యర్థిని ప్రెసిడెంట్ గా గెలిపిస్తావా? వైసీపీ వాళ్లంతా పోరంబోకులు తయారయ్యారు' అంటూ ఎమ్మెల్యే రాపాక మండిపడ్డారు. 'ఎవడ్రా .. నువ్వు వెధవ' అంటూ ఘాటుగా మాట్లాడారు.
ఈ ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసేన పార్టీ కార్యకర్తలు ఈ ఆడియోను వైరల్ చేస్తున్నారు. వైసీపీలో చేర్చుకున్నందుకు ఆ పార్టీ కార్యకర్తనే దూషించారని ట్రోల్స్ చేస్తున్నారు.అయితే ఈ వివాదంపై ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు స్పందించాల్సి ఉంది. దీనిపై ఆయన ఇప్పటిదాకా అధికారికంగా స్పందించలేదు.

వైరల్ అయిన ఆడియో టేపు ఇదీ..