పీజీ పరీక్షల్లో ఎమ్మెల్యే కొడుకు కాపీయింగ్ .. క్లిన్ చీట్ కోసం అధికారుల ప్రయత్నాలు !
కాదేది పరీక్ష కాపీయింగ్ కు అనర్హం అన్న చందంగా మారింది. పదో తరగతి పరీక్షలు మొదలుకుని అన్ని పరీక్షలు హైటెక్ కాపీయింగ్ వలలో చిక్కుకున్నాయి. అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతికతతో కాపీయింగ్ విధానం కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే అలా కాపీయింగ్ చేస్తూ పట్టుబడిన వారిలో కొంతమందికి మాత్రమే శిక్షలు పడుతున్నాయి మరికొంతమంది తమకున్న డబ్బు బలం , రాజకీయ బలం ఉపయోగించుకొని బయటపడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి గుంటూరు జిల్లాల్లో జరిగిందని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. అది కూడా ఎదో పది , ఇంటర్ పరీక్షల్లో కాదు ..ఏకంగా మెడికల్ పీజీ పరీక్షల్లో.. ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే ..
కరోనా కారణంగా వాయిదా పడ్డ పరీక్షలని గుంటూరు జిల్లాలోని ఒక ప్రైవేటు వైద్య కళాశాలలో హెల్త్ వర్సిటీ గత నెలలో మెడికల్ పీజీ వార్షిక పరీక్షలు కండెక్ట్ చేసింది. అయితే , సెప్టెంబరు 24న జరిగిన పరీక్షలో ఓ విద్యార్థి , చెవిలో బ్లూటూత్ పెట్టుకొని అవతలి వ్యక్తి సమాధానాలు చెప్తుంటే , క్లాస్ రూమ్ లో కూర్చొని రాసుకుంటున్నట్టుగా పరీక్ష రాస్తున్నాడు. ఇంతలో వర్సిటీ నుంచి వచ్చిన అబ్జర్వర్ ఆ విద్యార్థి కాపీయింగ్ కి పాల్పడుతున్నాడని గుర్తించి , రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, ఆ విద్యార్థి రాసిన పేపర్స్ ను తీసుకొన్నారు. అలాగే పరీక్షల్లో కాపీయింగ్ చేస్తున్నట్లు కేసు బుక్ చేశారు. అదేరోజు హెల్త్ వర్సిటీకి ఈ-మెయిల్ లో సమాచారం ఇచ్చారు. ఇంత జరిగింది కాబట్టి ఆ విద్యార్థిని మూడేళ్ల పాటు పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తారు. కానీ పట్టుబడిన విద్యార్థి గుంటూరు జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనయుడు అంట , దీనితో ఈ వ్యవహారం పై హెల్త్ వర్సిటీకి ఒకటే ఫోన్లు వెళ్లాయట.
మీరు కాపీయింగ్ చేస్తున్నాడని బుక్ చేసిన విద్యార్థి చాలా మంచివాడట , మీరెందుకు ఫిర్యాదు చేశారని’ ఆ మెడికల్ కళాశాల యాజమాన్యంపై వర్సిటీ ఉన్నతాధికారి ఫోన్ లో ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇందులో మాకేం సంబంధం లేదు. వర్సిటీ నుంచి వచ్చిన అబ్జర్వర్ పట్టుకున్నారు. విద్యార్థి బ్లూటూత్ పెట్టుకున్న వైనం అంతా సీసీ టీవీలో రికార్డయిందని యాజమాన్యం చెప్పినా సదరు అధికారి ఏ మాత్రం శాంతించకుండా , కళాశాల యాజమాన్యం పై ఫైర్ అయ్యాడట. ఈ వ్యవహారం పై . నలుగురు వైద్యాధికారులతో విచారణ కమిటీని వీసీ నియమించారు.
దీనితో ఈ నెల 22న ఆ కాపీయింగ్ కి పాల్పడ్డాడు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని కమిటీ విచారించనుంది. కాగా, ఆ విద్యార్థి కాపీయింగ్ కు పాల్పడలేదని, క్లీన్ చిట్ ఇవ్వాలని కమిటీ సభ్యులు అందరికీ ఇప్పటికే ఆదేశాలు జారీ అయినట్లు కొందరు చర్చించు కుంటున్నారు . విద్యార్థిని పట్టుకున్న మహిళా వైద్యురాలు సిద్ధార్థ కళాశాలకు చెందిన ఆప్తమాలజిస్ట్. ఆమె భర్త వర్సిటీ రిజిస్ట్రర్ గా పని చేస్తున్నారు. స్వయంగా వర్సిటీ అబ్జర్వర్ పట్టుకున్న కేసులో ఇలా జరుగుతుండటంతో వైద్యవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.