టీడీపీ జాతీయ పార్టీనా.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిప్పులు

Update: 2020-12-19 23:30 GMT
టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం వైసీపీకి జైకొట్టిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ మధ్య చంద్రబాబుపై ఒంటికాలి మీద లేస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన రెఫరెండం పిలుపుపై ఘాటుగా స్పందించాడు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రిఫరెండం అనడం చూస్తుంటే ఆయన వయసు మందగించిందని మరోసారి బయటపడిందని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ విమర్శించారు. కృష్ణ జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో కోటి రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ నిప్పులు చెరిగారు. జాతీయ పార్టీ అధ్యక్షుడని చెప్పుకునే చంద్రబాబు రిఫరెండం అనే మాట ఏ విధంగా మాట్లాడుతారని ధ్వజమెత్తారు. భారతదేశంలో ఏ విషయంలోనూ రిఫరెండం అనేదే లేదన్నారు.

అమరావతి రాజధాని ఏర్పాటు సమయంలో చంద్రబాబు ఎందుకు రిఫరెండం నిర్వహించలేదని ఎమ్మెల్యే వంశీ ప్రశ్నించారు. పనికిరాని వ్యక్తుల మాటలు పరిగణలోకి తీసుకోవాల్సిన పనిలేదని అన్నారు.

జాతీయ పార్టీ అంటే నాలుగు రాష్ట్రాల్లో సీట్లు ఉండాలని కనీసం ఒక రాష్ట్రంలోనే సరైన సీట్లు లేని మీరు జాతీయ పార్టీ అని ఏ విధంగా చెబుతారని అన్నారు.

చంద్రబాబు హైకోర్టులో గాగ్ ఆర్డర్ ఎందుకు తీసుకున్నారు? కొండను తవ్వి ఎలుకను పట్టారా? పందికొక్కులను పట్టారో త్వరలోనే తెలుస్తుందని వంశీ వ్యాఖ్యానించారు.




Tags:    

Similar News