అధికార పార్టీలో డిష్యూం డిష్యూం మొదలైంది. వర్గ విభేదాలు పొడచూపాయి. ఏపీలో కరోనా కేసులతోపాటు రాజకీయాలు కూడా వేడెక్కిస్తున్నారు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు. ఇప్పటికే రఘురామ లొల్లి పీక్స్ లో ఉండగా.. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీల మధ్య రాజకీయ పోరు హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పర్యటనను వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజినీ వర్గీయులు అడ్డుకోవడంతో వైసీపీలో విభేదాలు వీధినపడ్డాయి.
ఏపీలోని చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో వైసీపీ కార్యకర్త హరికృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వెళ్లారు. ఎంపీ కారును స్థానికంగా ఉన్న రజినీ వర్గీయులు అడ్డుకున్నారు. సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తారని ఎంపీని నిలదీశారు. ఆయన కారుకు అడ్డుపడి వాగ్వాదానికి దిగారు.
దీంతో సీరియస్ అయిన ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు ఇది అనధికార కార్యక్రమం అని ఎప్పుడైనా రావచ్చని.. ఇబ్బంది కలిగించవద్దంటూ రజినీ వర్గీయులను హెచ్చరించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వచ్చి ఇరువర్గాలను శాంతింపచేసి అక్కడి నుంచి పంపించేశారు.
గతంలో పురుషోత్తమ పట్నంలోనూ ఎంపీని ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకోవడం గమనార్హం. ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యే విడదల రజినీ వర్గం అడ్డుకోవడంతో వైసీపీలో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. ఎమ్మెల్యే విడుదల రజినీ నియోజకవర్గాన్ని సామంత రాజ్యంలా పాలిస్తున్నారనే ఆరోపణలు ఎంపీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.