సీఎం కేజ్రీవాల్‌ పై సంచలన ఆరోపణలు చేసిన సొంతపార్టీ ఎమ్మెల్యే !

Update: 2020-01-20 06:01 GMT
మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి మనవడు, సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆదర్శ్‌ శాస్త్రి ఆప్‌ కి గుడ్‌బై చెప్పి శనివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భం గా ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పై ఎమ్మెల్యే ఆదర్శ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ కోసం సీఎం కేజ్రీవాల్ రూ. 10 కోట్లు డిమాండ్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేసారు.శాసనసభ్యులను కలిసేందుకు కేజ్రీవాల్‌ సమయం కూడా ఇవ్వలేదని, నియంతగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కేజ్రీవాల్‌ టికెట్‌ పంపిణీని వ్యాపారంగా మార్చారని విమర్శించారు.

ఇకపోతే త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో తిరిగి పోటీ చేయాలని ద్వారక ఎమ్మెల్యే ఆదర్శ్ శాస్త్రి భావించాడు. అయితే తనకు టికెట్ కేటాయింపు కోసం సీఎం కేజ్రీవాల్ తనను రూ. 10 కోట్లు డిమాండ్ చేశారని ఆయన అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆయనకు టికెట్ కేటాయించకపోవడంతో ఆదర్శ్ శనివారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చోప్రా, ఏఐసీసీ ఇంఛార్జ్ పీసీ చాకో సమక్షంలో ఆదర్శ్ పార్టీలో చేరారు.

టికెట్ కోసం అంత డబ్బు చెల్లించే స్థోమత తనకు లేదని, అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆయన అన్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ 2020 అసెంబ్లీ ఎన్నికల టికెట్లను రూ. 10 నుంచి 20 కోట్లకు అమ్ముకుంటుందని ఆయన ఆరోపించారు. ఆదర్శ్ కాంగ్రెస్‌ లో చేరడంతో ఆ టికెట్‌ ను వినయ్ మిశ్రాకు ఆప్ కేటాయించింది. కాగా ఆదర్శ్‌ వ్యాఖ్యలు డీల్లీ రాజకీయాల లో పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి.
Tags:    

Similar News