టీఆర్ ఎస్ పార్టీని బలోపేతం చేయాల్సిన ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గం సీనియర్ నాయకులు.. ఉన్నత పదవులు అనుభవించిన నాయకులు.. ఇప్పుడు రోడ్డున పడ్డారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పరస్పర విమర్శలు చేసుకోవటంతో ఇన్నాళ్లు గుట్టుగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకు న్నారు.
మాజీ సీఎం చంద్రబాబు, కడియం శ్రీహరి హయంలో ఘనపురంలోనే అత్యధికంగా ఎన్కౌంటర్లు జరిగాయ ని.. 361 మందిని పొట్టనపెట్టుకున్నారని... రాజయ్య చేసిన పరోక్ష విమర్శలపై కడియం శ్రీహరి తీవ్రస్థాయి లో మండిపడ్డారు. పార్టీ నియమావళి అడ్డు వస్తున్నందున మాట్లాడలేకపోతున్నానని అంటూనే.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజయ్య చిల్లర చేష్టలు, అవినీతి, తాగుడు, వ్యవహారాలకు సంబంధించి తన దగ్గర అన్ని రికార్డ్గా ఉన్నాయన్నారు.
అవి బయటపెడితే.. రాజయ్య బయట తిరగలేరని అన్నారు. పార్టీ ఆదేశానుసారం.. ఎవరెక్కడ పోటీ చేయా లన్ననది నిర్ణయం ఉంటుందన్నారు. "ఇది నా అడ్డా.." అని రాజయ్య చెప్పుకోవడం తగదని సూచించారు. రాజయ్య తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి మాత్రమే కాదని... దేశంలో భర్తరఫ్ అయిన తొలి ఉపముఖ్య మంత్రి కూడా రాజయ్యేనని ఆక్షేపించారు.
అసలు ఏం జరిగింది?
జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్నపెండ్యాలలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు అడ్డగోలుగా ఎన్‌కౌంటర్లు చేయించారని ఆరోపించారు. ఒక్క నియోజకవర్గంలోనే 360 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్నారన్నారు.
తనకు రాజకీయ గురువు వైఎస్సార్ అయితే ప్రస్తుత సీఎం కేసీఆర్ దేవుడన్న రాజయ్య.. నియోజకవర్గానికి తాను పూజారినన్నారు. ఎప్పటికీ స్టేషన్‌ఘన్‌పూర్ తన అడ్డా అని, ఎవరినీ కాలు పెట్టనీయనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయంగా దుమారానికి దారితీసింది.
దీనికి కడియం ఆసక్తిగా స్పందించారు. విజయావకాశాలను దృష్టిలో పెట్టుకుని అధిష్ఠానం అవకాశాలు ఇస్తుంటుందన్నారు. అంతా సరిగ్గానే ఉంటే అసలు నా వరకు ఎందుకు వస్తుందని రాజయ్యపై సటైర్లు వేశారు. ఇప్పటికైనా చిల్లర మాటలు బంద్ చేయాలని, స్వచ్చంద సంస్థతో సర్వే చేయిద్దామని అన్నారు. ప్రజలు ఎవర్ని కోరుకుంటే వాళ్లే నియోజకవర్గంలో రాజకీయంగా ముందుకువెళ్దామని అన్నారు. మొత్తానికి ఇరువురు నాయకులు కూడా.. ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం.. పార్టీని రోడ్డున పడేయడం.. గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.