మ‌హిళా ఎమ్మెల్సీ ఆగ్ర‌హంపై య‌న‌మ‌ల మాట్లాడ‌లేదు

Update: 2017-11-23 04:54 GMT
య‌న‌మ‌ల ఎంత‌టి మాట‌కారో అంద‌రికి తెలిసిందే. మామూలుగా మాట్లాడినా ఎట‌కారంగా మాట్లాడిన‌ట్లుగా ఉండ‌టం ఆయ‌న ప్ర‌త్యేక‌త . అందుకే ఆయ‌న మాట్లాడుతుంటే.. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు ఒళ్లు మండిపోతుంది. ఎదుటి వ్య‌క్తి మాట‌ల్లో చిన్న చిన్న త‌ప్పుల్ని ప‌ట్టుకొని మాట‌ల‌తో చెడుగుడు ఆడుకోవ‌టం య‌న‌మ‌ల‌కు అల‌వాటే.

స‌బ్జెక్ట్ విష‌యంలో మాంచి ప‌ట్టున్న య‌న‌మ‌ల‌తో సంవాదం అంటే మామూలు క‌త కాదు. స‌బ్జెక్ట్‌.. మాట‌కారిత‌నం రెండు క‌లిసి ఉండే య‌న‌మ‌ల్ని ఫేస్ చేయ‌టం క‌ష్ట‌మే. అలాంటి య‌న‌మ‌ల‌ను క‌డిగిపారేశారు సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఒక‌రు.

అంద‌రి ఎదుట చెడామ‌డా అన్న‌ట్లుగా మాట‌లు అనేసిన మ‌హిళా ఎమ్మెల్సీ ఆగ్ర‌హంపై మౌనంగా ఉండిపోవ‌టం ఆయ‌నేమీ చేయ‌లేక‌పోయారు. త‌ప్పు చేసిన వాడిగా కామ్ అయిపోయాడు. నిజానికి స‌ద‌రు మ‌హిళా ఎమ్మెల్సీ అంత‌గా ర‌గిలిపోవ‌టానికి న్యాయ‌మైన కార‌ణం ఉంది కూడానూ. ఇంత‌కీ మంత్రి య‌న‌మ‌ల నోటి నుంచి మాట రాకుండా ఉండిపోయిన ఉదంతం ఎక్క‌డ చోటు చేసుకుంది? ఎందుక‌లా జ‌రిగింద‌న్న విష‌యంలోకి వెళితే.. ప్ర‌స్తుతం ఏపీలో అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్షం స‌భ‌కు గైర్హాజ‌రు కావ‌టం.. అధికార‌ప‌క్షం తో పాటు దాని మిత్ర‌ప‌క్షం స‌భ్యులు మాత్ర‌మే అసెంబ్లీ వెళుతున్నారు. దీంతో అధికార పార్టీ స‌మావేశం మాదిరి అసెంబ్లీ స‌మావేశాలు మారాయి త‌ప్పించి మ‌రెలాంటి మార్పు లేదు.ఇదిలా ఉంటే.. తాజాగా జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా ఎమ్మెల్సీ శ‌మంత‌క‌మ‌ణికి ఎదురుప‌డ్డారు మంత్రి య‌న‌మ‌ల‌.

అంతే ఆమె ఒక్క‌సారిగా బ‌ర‌స్ట్ అయ్యారు. మా ఇళ్ల‌ల్లో జ‌రిగిన పెళ్లిళ్ల‌కు ఎందుకు వ‌స్తారు?  మా ద‌ళితుల‌కు ఎలాగూ ప‌ద‌వులు ఇవ్వ‌రు.. గౌర‌వం ఇవ్వ‌రు.. క‌నీసం ఇంట్లో పెళ్లికి పిలిస్తే కూడా రారా..? ప‌ఐగా ఎవ‌రూ రాకుండా అంద‌రినీ పోల‌వ‌రం తీసుకెళ్తారా?  మా ఇళ్ల‌ల్లో పెళ్లిళ్లు అంటే మీకు చిన్న‌చూపు.. మీ ఇళ్ల‌ల్లో పెళ్లిళ్లు అంటే మాత్రం స‌భ‌కే సెలువులు.. ఆహా.. ఏం ప‌ద్ధ‌తి? ఇది స‌రైన ప‌ద్ధ‌తేనా? అంటూ చెడామ‌డా ఉతికి పారేసింది.

ఎమ్మెల్సీ శ‌మంత‌క‌మ‌ణి ఆగ్ర‌హంతో య‌న‌మ‌ల కామ్ అయిపోయారు. నోట మాట రాని రీతిలో ఉండిపోయారు. శ‌మంత‌క‌మ‌ని కూతురే యామినీ బాల‌. శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే క‌మ్ ప్ర‌భుత్వ విప్ కూడా. యామినిబాల కుతూరు సంధ్య వివాహం ఈ నెల 16న అనంత‌పురంలో జ‌రిగింది. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు ఇలా పేరుపేరునా పిలిచారు. అంద‌రూ కాకున్నా కొంద‌రైనా త‌ప్ప‌కుండా వ‌స్తార‌ని అనుకున్నారు.

తీరా వాళ్లింట్లో పెళ్లి రోజునే పోల‌వ‌రం టూరు పెట్ట‌టం నేత‌లంతా అక్క‌డ‌కు వెళ్లారు. దీంతో.. శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే ఇంట పెళ్లికి అంద‌రూ క‌లిసి డుమ్మా కొట్టారు. సొంత పార్టీ నేత‌లు భారీగా రావాల్సింది పోయి ఎవ‌రూ రాక‌పోవ‌టంతో వారికి చివుక్కుమంది. ఎమ్మెల్సీ.. ఎమ్మెల్యే క‌మ్ విప్ ఇంట్లో పెళ్లి అంటే అంచ‌నాలు భారీగా ఉంటాయి క‌దా. వాటికి బిన్నంగా సొంత పార్టీకి చెందిన వారెవ్వ‌రూ రాక‌పోవ‌టంతో శ‌మంత‌క‌మ‌ణి తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు. మంత్రి య‌న‌మ‌ల క‌నిపించినంత‌నే బ‌రస్ట్ అయ్యారు.

ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్య‌న ప‌రిటాల వారింట జ‌రిగిన‌పెళ్లికి ఆంధ్రా.. తెలంగాణ రాష్ట్రాల‌కు చెందిన నేత‌లు ప‌లువురు క్యూ క‌ట్టారు. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు వెళ్లారు. పెద్దోళ్ల సంగ‌తి వ‌దిలేస్తే.. కింద‌నున్న మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు ఎవ‌రూ పెళ్లికి రాక‌పోవ‌టంతో అవాక్కు అయిన వారు.. త‌మ మంట‌ను య‌న‌మ‌ల ముందు ప్ర‌ద‌ర్శించారు. సొంత పార్టీ ఎమ్మెల్సీ.. ఎమ్మెల్యే ఇంట జ‌రిగిన పెళ్లికి వెళ్ల‌క‌పోవ‌టం.. వారు మాట్లాడిన దాన్లో న్యాయం  ఉంద‌నిపించిదేమో కానీ  య‌న‌మ‌ల స‌మాధానం చెప్ప‌లేక కామ్ గా ఉండ‌టం ప‌లువురి దృష్టిని ఆక‌ర్షించింది.
Tags:    

Similar News