ఓటర్లకు శాపంగా ఈసీ నిర్ణయం

Update: 2019-04-11 11:06 GMT
ఎన్నికల సంఘం పెట్టిన నిబంధన ఓటర్ల పాలిట శాపమవుతోంది. కొందరు ఓటర్లు  ఈ నిబంధనలతో ఓటు వేయకుండానే వెనుదిరుగుతున్నారు. గత ఎన్నికల సమయంలో కొందరు ఓటర్లు ఓటు వేసేటప్పుడు సెల్ఫీలు తీసుకొని, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఈసారి పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ పోన్లు అనుమతించేది లేదని ఈసీ స్పష్టం చేసింది.

అయితే మొబైల్ ఫోన్లకు ఎలాంటి అనుమతి లేదని.. ముందస్తు ప్రకటన కానీ.. ప్రచారం కానీ చేయకపోవడంతో  ఓటర్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో మొబైల్ తో పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. వారిని అనుమతించలేది లేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఓటర్లు అవాక్కయ్యారు.

హైదరాబాద్ లో ఇలా మొబైల్ ఫోన్ వెంటపెట్టుకొని వచ్చిన చాలామందిని అధికారులు అనుమతించలేదు. దీంతో ఫోన్ ఎక్కడ పెట్టాలో తెలియక చాలా మంది ఓటర్లు ఓటు వేయకుండానే వెనుదిరిగారు.

సాధారణంగా మొబైల్స్ నిషేధించినప్పుడు వాటిని ఎక్కడైనా ఆవరణలో భద్రపరిచేందుకు అవకాశం కల్పిస్తారు. పరీక్షా కేంద్రాల్లో ఇలాంటి వెసులుబాటు ఉంటుంది. కానీ పోలింగ్ కేంద్రాల్లో మొబైల్ పోన్లు భద్రపరిచేందుకు ఎలాంటి సౌకర్యం కల్పించకపోవడంతో ఓటర్లు ఓటు వేయకుండానే వెనుదిరిగారు.
Tags:    

Similar News