చెత్తకుప్పలపై మోడల్ క్యాట్ వాక్: ఎందుకో తెలుసా..?

Update: 2021-09-07 02:05 GMT
నగరం నడిబొడ్డున పెద్ద పెద్ద భవనాలు.. అందమైన పార్కులు.. వయ్యారంలా రోడ్లు.. రాత్రయిందంటే కళ్లు జిగేళ్లుమనే లైట్లు.. ఇలాంటి వాతావరణంలో ఉండడానికి ఎవరికైనా ఇష్టంగానే ఉంటుంది. అయితే నగర శివారులోకి వెళ్లి చూస్తే మాత్రం ముక్కు మూసుకోక తప్పదు.. నగరం మొత్తం విడిచిపెట్టిన చెత్తా చెదారం గుట్టలు గుట్టలుగా కనిపిస్తుంది. నగరం శుభ్రంగా ఉండేవరకు మాత్రమే చూస్తున్న ప్రభుత్వం డంప్ యార్డ్ ను పట్టించుకోవడం లేదు. సంవత్సరాలుగా కుప్పలుగా ఉన్న ఈ డంప్ యార్డుతో కొత్త కొత్త రోగాలన్నీ బయటకు వస్తున్నాయి. అయితే ఈ డంప్ యార్డ్ పై దృష్టి పెట్టాలని ఓ మోడల్ విచిత్రమైన పనిచేసింది. ఆమె చేసిన పని వల్ల ప్రభుత్వ అధికారుల్లో కదలిక వచ్చింది.. ఇంతకు ఆ మోడల్ చేసిందేమిటి..?

2020లో మిస్ ఝార్ఘండ్ టైటిల్ గెలుచుకుంది సురభి. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈమె అప్పటి వరకు స్కర్ట్ వేసుకొని నున్నటి బల్లపై మాత్రమే నడిచేంది. సువాసన కలిగిన భవనంలో అతిరథుల మధ్య క్యాట్ వాక్ చేసేది. కానీ హఠాత్తుగా రెడ్ స్కర్ట్ వేసుకొని డంప్ యార్డ్ పై వయ్యారంగా నడుస్తూ కనిపించింది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు షాక్ కు గురయ్యారు. అందమైన మోడల్ ఇలా చెత్తకుప్పల మధ్య నడవడమేంటి..? అని చర్చించుకుంటున్నారు.

‘ఝార్ఘండ్ రాష్ట్ర రాజధాని రాంచీ శివార్లలో నగరంలో నుంచి తీసుకెళ్లిన చెత్త పడేసే డంప్ యార్డ్ ఉంది. ఇలాంటి డంప్ యార్డుల్ ప్రతీ నగర శివారులో ఉంటాయి. ఈ డంప్ యార్డ్ వెంబడి వెళ్తుండే భరించలేని దుర్వాసన ఉంటుంది. అప్పుడప్పుడు వెళ్లే మనకే ఇంతలా అనిపిస్తుంటూ డంప్ యార్డ్ కు సమీపంలో ఉన్నవారి పరిస్థితి ఏంటి..? ’ అని మోడల్ సురభి అంటున్నారు.

‘ప్రాంజల్ అనే ఫొటో గ్రాఫర్ కొన్నాళ్ల కిందట నన్ను కలుసుకున్నారు. నాతో కొన్ని విషయాలు మాట్లాడారు. మన దేశంలో టన్నుల కొద్దీ చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. ఇందులో 75 శాతం వరకు శుద్దీ కావడం లేదు. దాదాపు ప్రతీ సంవత్సరం మూడు కోట్ల టన్నులకు పైగా చెత్తను డంప్ యార్డుకు తరలిస్తున్నారు. ఇది రాను రాను ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. ఇక రాంచీ విషయానికొస్తే అన్నిప్రాంతాల నుంచి చెత్తను తీసుకొచ్చ ఇక్కడ రెండు లక్షల టన్నులకు పైగా డంప్ చేశారు. ఈ చెత్త వల్ల కాలుష్యంతో పాటు చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. రింగ్ రోడ్డు బయట ఉన్న ఈ ప్రదేశానికి గ్రీన్ ఫీల్డుగా ప్రకటించారు. కానీ అదే ప్లేసులోచెత్తను పారబోస్తున్నారు.

ఇప్పటికైనా మనం మేల్కోకపోతే రాను రాను ప్రతి ఒక్కరు చెత్త తెచ్చే ప్రమాదాలకు గురి కావాల్సి ఉంటుంది. ఈ సమస్యపై కొన్ని ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెట్టినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే దానికి ఫ్యాషన్ జోడిస్తే ప్రపంచం మొత్తం మనవైపు చూస్తుుందనే ఆలోచన ఉంది. అందుకోసం కొందరు మోడల్స్ అడిగాను.. వాళ్లు ఒప్పుకోలేదు.. చెత్తకుప్పల మీద నడవడం అంటే మా వళ్ల కాదు అని చెప్పారు..’అని ప్రాంజల్ తనతో చెప్పినట్లు సురభి తెలిపింది.

‘అయితే ఇంతటి సమస్యను ప్రపంచానికి తెలియజేసేందుకు నేను ఏమాత్రం మోహమాటం లేకుండా అంగీకరించారు. ఆ తరువాత ఎర్రరంగు స్కర్ట్ వేసుకొని స్లిప్లర్స్ మాత్రమే వేసుకొని చెత్తకుప్పలపై నడిచాను. 210 అడగుల ఎత్తు పై నుంచి డ్రోన్ ద్వారా ఈ వీడియోను చిత్రీకరించారు. అయితే ఎర్ర రంగు స్కర్ట్ వేసుకోవడానికి ఓ కారణం ఉంది. నా కేమైనా ప్రమాదం ఎదురైతే చెప్పడానికే దానిని ధరించాను దాదాపు గంట సేపు ఈ షూటింగ్లో పాల్గొనాల్సి వచ్చింది. ఆ గంట సేపు అక్కడున్న వాసనకు నా తల తిరిగినట్లయింది.’ అని సురభి తెలిపారు.
Tags:    

Similar News