అత్యంత ప్ర‌జాద‌ర‌ణ : మోడీ ప్లేస్ అదిరింది

Update: 2015-10-28 15:22 GMT
భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ మ‌రోమారు త‌న స‌త్తా చాటారు. విశేష‌మైన ఫాలోయింగ్ క‌లిగిన మోడీ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల జాబితాలో అపూర్వ‌మైన స్థానంలో నిలిచారు. వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం నిర్వ‌హించిన స‌ర్వేలో టాప్ టెన్ లిస్ట్‌లో భారత ప్రధాని నరేంద్రమోడీకి స్థానం లభించింది. 125 దేశాలలోని 285 నగరాలలో లక్షలాది మంది ఈ సర్వేలో తమ అభిప్రాయం తెలిపారు. ఆ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు దివంగత మండేలా తొలి స్థానం దక్కించుకున్నారు. రెండో స్థానంలో పోప్ ఫ్రాన్సిస్ నిలిచారు. మూడో స్థానంలో టెల్సా మోటార్స్ సీఈవో ఎలన్ ముస్క్ నిలవగా మ‌న జాతిపిత మహాత్మా గాందీ నాలుగో స్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు5వ స్థానం దక్కింది.

ఈ జాబితాలో 6వ  స్థానంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, 7 స్థానంలో వర్జిన్ గ్రూప్ అధినేత రిచర్డ్ బ్రాన్ సన్, 8వ స్థానంలో యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ - తొమ్మిదో స్థానంలో గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ యూనస్ నిలిచారు. పదో స్థానంలో ప్రధాని నరేంద్రమోడీ నిలవగా పదకొండో స్థానంలో అమెరికా బిజినెస్ మ్యాగ్నెట్ వారెన్ బఫెట్ నిలిచారు. ఈ సర్వేలో పాల్గొన్న  వారిలో 20.1 శాతం మంది మండేలాకు ఓటు వేయగా, 12.4శాతం మంది మహాత్మాగాంధీకి తమ ఓటు వేశారు.
Tags:    

Similar News