మోడీ తేనున్న ‘నవ‘ శకం ఇదీ..

Update: 2016-11-24 06:57 GMT
ఇండియాలో నల్లధనం - అవినీతినిపూర్తిగా నిర్మూలించేందుకు ప్రధాని మోడీ పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో భారీ షాకిచ్చి... జనం మద్దతు కూడా పొందారు. అయితే... మోడీది సింగిల్ స్టెప్ మిషన్ కాదట... దీనికి కంటిన్యూషన్ ఉందని.. మొత్తం మిషన్ పూర్తయ్యేసరికి ఇండియా సరికొత్తగా మారిపోతుందని చెబుతున్నారు.

మలి విడతలో మోడీ  లక్షా పాతికవేల మంది రిటైర్డ్ ఇన్‌ కమ్ టాక్స్ అధికారుల్ని రంగంలోకి దింపి పన్ను ఎగవేతదారుల భరతం పట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం 9అంచెల యాక్షన్ ప్లాన్ ఆయన వద్ద రెడీగా ఉందట. సోషల్ మీడియాలో దీనిపై రకరకాల కథనాలు షేర్ అవుతున్నాయి.

- 58 నుంచి 61 ఏళ్ల వయసున్న రిటైర్డు ఆదాయ పన్ను అధికారులను మోడీ మళ్లీ రంగంలోకి దించుతారు. వారు ఏం చేయాలనేది మూడు రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఇది నవంబరు 28 నుంచి 30 వరకు ఉంటుందట. ఆ తరువాత వారంతా డిసెంబరు 1 నుంచి తమ పని మొదలుపెడతారట.

- ఇప్పటికే మొదలైన మొదటి దశలో 500 - 1000 నోట్లను రద్దు చేశారు. దాని ఫలితంగా 14 లక్షల కోట్లు మార్కెట్ నుంచి ఉపసంహరణ కానుంది.

- ఇప్పుడున్న నోట్లకు బదులు కొత్తగా 2 వేలు - కొత్త 500 ప్రింటుచేయడంతో పాటు పాత 100కి అదనంగా కొత్తగా మరిన్ని 100 రూపాయల నోట్లు ప్రింట్ చేస్తున్నారు.

- దేశాన్ని క్యాష్ లెస్ కంట్రీగా చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇకపై 10 వేలు దాటిని ట్రాంజాక్షన్లీ ఆన్ లైనే కావాలి.

- ఇకపై జీతాలు - బదలాయింపులు వంటివన్నీ చెక్కులు - ఆన్ లైన్ ద్వారానే సాగేలా చర్యలు తీసుకుంటారు.

-  మలి దశలో రూ.2 వేల నోటును కూడా మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటారు.

- బంగారంపైనా ఆంక్షలు పెరుగుతాయి.

- అరకేజీకి మించి ఎవరి వద్దాబంగారం లేకుండా చర్యలుంటాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News