నవ్యాంధ్ర రాజధాని అమరావతి రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లు కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్నాయి. విజయదశమి సందర్భంగా ఆ రోజు ఏపీ ప్రజలందరు దసరాతో పాటు రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా పెద్ద పండుగలా జరుపుకుంటున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి వస్తున్న మోడీ పర్యటన షెడ్యూల్‌ను అధికారులు రూపొందించారు. అయితే దీనిపై పీఎంవో, ప్రధాని భద్రతా విభాగం ఎస్పీజీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మోడీ పర్యటనకు సంబంధించి అధికారులు రూపొందించిన షెడ్యూల్ ఇలా ఉంది.
22వ తేదీ (విజయదశమి)
ఉదయం 11.20 (గంటలు) - ప్రధానమంత్రి మోడీ గన్నవరం ఎయిర్ పోర్టుకు రాక
12.20 - ఉద్ధండరాయుని పాలెంకు మోడీ చేరుకుంటారు
12.35 - రాజధానికి శంకుస్థాపన
12.45- మా తెలుగు తల్లి గీతాలాపన
1.10- రాజధాని ఏర్పాటు కోసం భూములిచ్చిన రైతులకు సన్మానం. రైతుల సన్మానం తర్వాత మోడీచే ఈ - బ్రిక్ పోర్టల్ ఆవిష్కరణ
1.17- చంద్రబాబు ప్రసంగం
1.40- మోడీ ప్రసంగం
2.40- మోడీ, చంద్రబాబు కలిసి విందులో పాల్గొంటారు.
అనంతరం తిరుపతికి బయలు దేరతారు. అక్కడ వేద పాఠశాలను మోడీ ప్రారంభించి అనంతరం తిరుగు ప్రయాణమవుతారు.