కేసీఆర్‌ ను ప్ర‌ధాని మోడీ అడిగిన క్వ‌శ్చ‌న్‌

Update: 2017-06-24 04:48 GMT
ఎన్డీయే ప‌క్ష రాష్ట్రప‌తి అభ్య‌ర్థి రామ్ నాథ్ కోవింద్ నామినేష‌న్ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన కేసీఆర్ తో ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ.. రావుజీ.. వ‌ర్షాలు బాగా ప‌డుతున్నాయా? అని ప్ర‌శ్నించిన‌ట్లుగా తెలుస్తోంది. దీనికి బ‌దులిచ్చిన కేసీఆర్ తెలంగాణ‌లో వాన‌లు బాగా ప‌డుతున్నాయ‌ని బ‌దులిచ్చారు. అక్క‌డే ఉన్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆ ప్ర‌శ్న‌కు తానూ బ‌దులివ్వ‌టం గ‌మ‌నార్హం.

వాళ్ల‌కు (తెలంగాణ‌) రెండేళ్లుగా వ‌ర్షాలు బాగానే ప‌డుతున్నాయ‌ని.. త‌మ ప్రాంతంలోనే వ‌ర్ష‌పాతం త‌క్కువ‌గా ఉంద‌ని బ‌దులిచ్చారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌.. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ లు సైతం వ‌ర్షాల గురించి రియాక్ట్ అయ్యారు.

త‌మ ప్రాంతాల్లో కూడా ఆశించిన‌త వ‌ర్షాలు ప‌డ‌లేద‌న్న మాట‌ను వారు సైతం చెప్పినట్లుగా తెలుస్తోంది. వీరి మాట‌ల్ని విన్న ప్ర‌ధాని మోడీ స్పందిస్తూ.. మీరు నీటి ప్రాజెక్టుల వెంట‌ప‌డ్డారు.. అందుకే వ‌ర్షాలు పడుతున్న‌ట్లున్నాయి అని ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ తో వ్యాఖ్యానించిన‌ట్లుగా తెలుస్తోంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. రికార్డు వ్య‌వ‌ధిలో ప‌ట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేశామ‌ని.. పోల‌వ‌రం ప‌నుల్ని ప‌రుగులు పెట్టిస్తున్నామ‌ని.. ప్ర‌తి సోమ‌వారం ఆ ప‌నుల మీద రివ్యూ చేస్తున్న‌ట్లుగా చెప్పుకునే చంద్ర‌బాబుకు మోడీ మాట‌లు జీర్ణించుకోలేనివిగా మారిన‌ట్లుగా చెబుతున్నారు. ఓప‌క్క తాను ఇరిగేష‌న్ ప్రాజెక్టుల్ని చేప‌ట్టినా.. ప్ర‌ధాని మ‌దిలో మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేప‌ట్టిన మిష‌న్ భ‌గీర‌థ‌.. ప‌లు సాగునీటి ప్రాజెక్టులు గుర్తు ఉన్న‌ట్లుగా ఉన్న మోడీ మాట‌లు బాబుకు ఇబ్బందిక‌రంగా మారిన‌ట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News