ఉద్యోగుల భవిష్య నిధిలో దాచుకున్న డబ్బును తీసేటప్పుడు దానిపై పన్ను వేయాలని మొన్నటి బడ్జెట్ లో చేసిన ప్రతిపాదనను కేంద్ర ఉపసంహరించుకోనుంది. ఈ మేరకు గట్టి సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు... పన్ను వేస్తే ఇక ఈపీఎఫ్ లో దాచుకోవడం వల్ల వచ్చే లాభమేంటన్నచర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. దీంతో పీఎఫ్ మొత్తాలు తీసేసి... పీఎఫ్ ఖాతాలో చెల్లింపులను కూడా ఆపేయాలని ఇప్పటికే చాలామంది నిర్ణయించుకుని ఆ దిశగా పని మొదలెట్టేశారు. పీఎఫ్ డబ్బులు తీసేసి ఇరత పెట్టుబడులు, పొదుపు మార్గాల్లో పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన కేంద్రం మొదటికే మోసం వచ్చేలా ఉందని గుర్తించి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోబోతోందని సమాచారం. ప్రధాని మోడీ దీనిపై ఆర్థిక మంత్రి జైట్లీకి సూచనలు చేశారట.
ఈపీఎఫ్ పై పన్నులు వేయడాన్ని పునరాలోచించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని ప్రధాని నరేంద్రమోడీ ఆదేశించారు. దీంతో త్వరలో ఈపీఎఫ్ పై పన్నులు ఉపసంహరించుకునే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్ లో ప్రతిపాదించిన నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుండడంతో ఆలోగానే ఉపసంహరణ నిర్ణయం కూడా వెలువడనుందని సమాచారం. సో.... పీఎఫ్ గురించి ఉద్యోగులు ఇక చింతించనవసరం లేదు. అందులో డబ్బులు తీసేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట.