అమెరికా అధ్యక్షుడు భారత్ లో పర్యటించిన సందర్భంగా ప్రధాని మోడీ ధరించిన దుస్తుల గురించిన చర్చ భారీగా సాగటమే కాదు.. ఈ ఎపిసోడ్ ఆయన పరపతిని దెబ్బ తీయటం జరిగింది. అప్పట్లో.. అమెరికా అధినేత ఒబామా సతీమణి కంటే కూడా మోడీ డ్రెస్సుల మీదనే ఎక్కువ చర్చ జరిగింది.
డ్రెస్సుల విషయంలో మోడీ తన మోజు తగ్గించుకోలేదన్న విషయం తాజా అమెరికా పర్యటనలో మరోసారి రుజువైంది. మోడీ అమెరికా పర్యటనలో ఆదివారం అత్యంత కీలకమైన భేటీలు.. సమావేశాలున్నాయి. ఊపిరి సలపనంత ఒత్తిడి ఉంది. అయినప్పటికీ.. తనకు లభించిన కొద్దిపాటి సమయంలోనూ మోడీ నాలుగు డ్రెస్సుల్ని మార్చటం గమనార్హం.
ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ వివిధ కార్యక్రమాల్లో హాజరైన మోడీ.. సందర్భానికి తగ్గట్లు డ్రెస్సుల్ని మార్చుకోవటం కనిపించింది. ఆదివారం ఉదయం టెస్లా మోటార్స్ లో జరిగిన సమావేశానికి ఒక రకం డ్రెస్ వేసుకున్న మోడీ.. ఆ తర్వాత జరిగిన డిజిటల్ ఇండియా విందు సమావేశానికి మరో డ్రెస్సు ధరించారు. ఇక.. సాయంత్రం మైక్రోసాఫ్ట్ సీఈవో.. సత్యనాదెళ్లతో జరిగిన భేటీకి ఇంకో డ్రెస్సు వేసుకున్న మోడీ.. ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ తో జరిగిన చిట్ చాట్ కు నాలుగోసారి డ్రెస్సు మార్చటం కనిపించింది. మొత్తానికి బిజీబిజీగా ఉండి కూడా తనకున్న డ్రెస్ సెన్స్ ను మోడీ ప్రదర్శించటం విశేషం.