అలా చేయడం బిహారీలకు అవమానం కాదా : ప్రధాని మోడీ!

Update: 2020-10-23 11:50 GMT
బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. తొలి దశ ఎన్నికలకు మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న సమయంలో, బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఆయన విస్తృతంగా పర్యటించి, పలు ర్యాలీలు, రోడ్ షోలను నిర్వహించనున్నారు. ఇక ఈ నేపథ్యంలో తోలి రోజు ప్రచారంలో భాగంగా .. సారాంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన మోడీ విపక్షాలపై మండిపడ్డారు. ముఖ్యంగా ఎక్కడో కశ్మీర్‌లోని ఆర్టికల్ 370ని బీహార్‌ కు ముడిపెడుతూ మాట్లాడటం అవమానం పై విపక్షాలను ఏకిపారేశారు.

దేశం ఎన్నో ఏళ్లు గా ఎదురుచూస్తున్న జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ ఎన్డీయే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది అని , కానీ ఇప్పుడు యూపీఏ కూటమిలోని విపక్షాలు ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. అలాగే యూపీఏ అధికారంలోకి వస్తే దీన్ని పునరుద్ధరిస్తామని చెబుతున్నారని, ఇది బీహార్‌ నుంచి అమరవీరులైన జవాన్లకు అవమానమే అని మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు చేయడం ద్వారా వారు బిహారీలను అవమానించినట్టు కాదా?. దేశ రక్షణ కోసం తన కొడుకులను, కూతుళ్లను సరిహద్దుల్లోకి పంపుతున్న బిహార్‌ కు అవమానం కాదా అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు బీహార్‌ ఇప్పుడు అభివృద్ధి పథంలో ఉందని, దాన్ని ఎవరూ నిస్సహాయ రాష్ట్రంగా చెప్పలేరని అన్నారు. బీహార్‌లో రోడ్లు, వంతెనల అనుసంధానమే తమ ప్రాధాన్యమని, ఇందుకోసం వేల కిలోమీటర్ల మేర రహదారులను వెడల్పు చేశామని, మిగతా రోడ్లతో వాటిని అనుసంధించామని మోడీ తెలిపారు. బీహార్‌ లోని నదులపై కడుతున్న అధునాధున వంతెనలే ఇందుకు నిదర్శమన్నారు. దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా విపక్షాలు అన్నింటినీ అడ్డుకుంటున్నాయని మోడీ ఆరోపించారు. తాజాగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను అడ్డుకుంటోంది కూడా దళారులే అంటూ ఫైర్ అయ్యారు.

ఇక ,కరోనాను ఎదర్కొవడంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కఠిన నిబంధనలు అమలు చేశారని, ఆయన అలా చేయకుంటే పరస్థితులు దారుణంగా తయ్యారయ్యేవని అన్నారు. ప్రజలు కూడా కరోనాపై పోరులో ఎంతగానో సహకరించారని అభినందించారు. పోలింగ్‌కు ముందే బిహార్ ప్రజలు తమ సందేశాన్ని ఇచ్చారని.. అని సర్వేలు బిహార్ ‌లో ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయని తెలిపారు. అభివృద్ధి పథంలో నడిపిన పాలకులను మరోసారి గెలిపించుకునేందకు ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.
Tags:    

Similar News