అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి కన్నుమూసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కడసారి వీడ్కోలు పలకడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నై వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన రాజాజీహాల్ ప్రాంతానికి చేరుకొని జయలలితకు నివాళులర్పించారు. మోడీ అక్కడకు వచ్చిన సమయంలో అక్కడ ఉన్న పన్నీరు సెల్వం - శశికళ ఉద్వేగానికి లోనయ్యారు. వారిని మోడీ ఓదార్చారు.
ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకు వెళ్లిన మోడీ.. విమానాశ్రయం నుంచి జయలలిత పార్థివదేహం ఉంచిన రాజాజీ హాల్ కు చేరుకున్నారు. జయలలిత పార్థివదేహం వద్ద ప్రధాని పుష్పగుచ్చం ఉంచి శ్రద్దాంజలి ఘటించారు. జయలలిత స్నేహితురాలు శశికళ తలపై నిమిరి ఓదార్చారు. శశికళ, తమిళనాడు ముఖ‍్యమంత్రి పన్నీరు సెల్వం కన్నీటి పర్యంతమవగా వారిద్దరినీ ఓదార్చారు. పన్నీరు సెల్వం భుజం తట్టి క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాల్సిందిగా చెప్పారు.
కాగా సాయంత్ర జరగబోయే జయ అంత్యక్రియల్లోనూ మోడీ పాల్గొననున్నారు. మెరీనా బీచ్ లో గురువు ఎంజీఆర్ సమాధి పక్కన జయ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా చెన్నై చేరుకున్నారు. ఆయన జయ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/