మోదీ... ఇంత‌లా త‌ల బాదుకోవాలా?

Update: 2017-03-17 12:00 GMT
ఇటీవ‌ల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వాస్త‌వ ఫ‌లితాల ఆధారంగా చూస్తే... దేశ రాజ‌కీయాల‌ను పెను ప్ర‌భావితం చేసే స‌త్తా ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌ల‌మ ద‌ళం బీజేపీ ఘ‌న విజ‌యాన్నే సాధించింది. ఏ ఒక్క పార్టీతో పొత్తు లేకుండానే ఆ రాష్ట్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో బీజేపీకి సీట్లు వ‌చ్చాయి. మొన్న‌టిదాకా అధికారం చెలాయించిన అఖిలేశ్ పార్టీ స‌మాజ్ వాదీ పార్టీకి గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ మద్ద‌తిచ్చినా కూడా జ‌నం బీజేపీకే బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. మిగిలిన నాలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే... అస‌లు మెజారిటీనే రాని గోవా, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో ఇప్ప‌టికే బీజేపీ ప్ర‌భుత్వాలు కొలువుదీరాయి. బీజేపీ ర‌చించిన ప‌క్కా వ్యూహంతోనే కాంగ్రెస్ కంటే కూడా త‌క్కు సీట్లు సాధించిన బీజేపీ... త‌న అధికార దండాన్ని వినియోగించి ఆ రెండు రాష్ట్రాల పాల‌న బాధ్య‌త‌ల‌ను చేజిక్కించుకుంద‌న్న వాద‌న లేక‌పోలేదు.

మెజారిటీ రాని రాష్ట్రాల్లోనే ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేసిన బీజేపీ... సంపూర్ణ మెజారిటీ వ‌చ్చిన యూపీ విష‌యంలో మాత్రం ఎందుకు మీన మేషాలు లెక్కిస్తుందో అర్థం కావ‌డం లేదు. యూపీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నేత‌లో, ఆ రాష్ట్రానికి చెందిన జాతీయ స్థాయి నేత‌ల వ‌ల్లో అక్క‌డ బీజేపీకి ఓట్లు ప‌డ‌లేద‌న్న విష‌యం జ‌ర‌గ‌మెరిగిన స‌త్య‌మే. కేవ‌లం మోదీ మేనియానే ఆ రాష్ట్రంలో బీజేపీకి బ్ర‌హ్మాండ‌మైన విజ‌యాన్ని చేకూర్చిపెట్టింద‌న్న విష‌యాన్ని కూడా మ‌నం మ‌రిచిపోకూడ‌దు. మ‌రి అలాంట‌ప్పుడు ఆ రాష్ట్ర సీఎంగా ఎవ‌రిని నియ‌మించాల‌న్న విష‌యంపై మోదీ ఎందుకు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు? ఇదే ప్ర‌శ్న ఒక్క యూపీ వాసుల‌నే కాకుండా యావ‌త్తు దేశ ప్ర‌జ‌ల‌ను కూడా తీవ్ర అయోమ‌యానికి గురి చేస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇప్ప‌టికే యూపీ సీఎం రేసులో ఆ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య ముందు వ‌రుస‌లో ఉన్నారు. విచిత్ర‌మేమిటంటే... రేసులో ముందున్న వ్య‌క్తికే సీఎం ఖ‌రారు బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. సీఎం అభ్య‌ర్థిని తానే ఎంపిక చేయాల‌ని చెప్పిన‌ప్పుడు నా పేరును నేను ప్ర‌క‌టించుకునేదెలాగా? అంటూ మౌర్య ఏకంగా నిన్న ఆసుప‌త్రిలో చేరిపోయారు. ఈ హైటెన్ష‌న్‌కు ప్ర‌ధాన కార‌ణం ఏమిటో తెలియ‌ట్లేదు గానీ... యూపీ హైడ్రామా రేపు సాయంత్రం దాకా కొన‌సాగే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. రేపైనా ఈ స‌స్పెన్స్‌కు మోదీ తెర దించుతారో?  లేదో?  చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News