సుజనా చౌదరి. బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టినట్టు ఆరోపణలున్నా.. దర్జాగా కేంద్ర మంత్రి పదవిని వెలగబెడుతున్న మహా నాయకుడు. ఆయనకు.. టీడీపీ అధినేత - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అండదండలున్నాయన్నది.. బహిరంగ సత్యం. అందుకే.. అన్ని ఆరోపణలున్నా కూడా.. స్నేహ ధర్మాన్ని పాటిస్తూ.. ఇన్నాళ్లూ కేంద్ర కేబినెట్ లో సుజనా చౌదరిని.. బలవంతంగా అయినా భరిస్తూ వచ్చారు ప్రధానమంత్రి మోడీ.
కానీ.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇప్పుడు.. సుజనా చౌదరి విషయంలో కూడా ఈ విషయం నిజమే అని ప్రూవ్ అవుతోంది. ఢిల్లీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఈ మధ్యే.. మోడీ.. చంద్రబాబును పిలిపించి మాట్లాడారట. ప్రతి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తోంది. జనంలో బీజేపీపై అన్ని వర్గాల్లో నమ్మకం పెరుగుతోంది. విపక్షాలకు చిన్న అవకాశం కూడా ఇవ్వదలుచుకోలేదు. బీజేపీని.. ఏ రకంగా కూడా.. విపక్షాలు ప్రశ్నించకూడదన్నదే నా అభిమతం. సుజనా చౌదరి విషయంలో.. ఓ సారి ఆలోచించుకోండి. ఇప్పటికే.. ఆయనపై చాలా ఆరోపణలున్నాయి. బ్యాంకుల్లో అప్పులు ఎగ్గొట్టినట్టు ఫిర్యాదులున్నాయి. వాటన్నిటినీ క్లియర్ చేసుకోవాల్సిందే. లేదంటే.. సుజనా చౌదరి కేంద్రంగా ప్రతిపక్షాలు బీజేపీని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి, అని చంద్రబాబుకు మోడీ తేల్చి చెప్పారట.
సుజనాకు కాకుండా మరో సమర్థ టీడీపీ నాయకుడికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధమే అని మోడీ స్పష్టం చేసినట్టు సమాచారం అందుతోంది. అవసరమైతే.. అశోక గజపతిరాజు లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిలా మరో నాయకుడిని సూచించాల్సిందిగా.. బాబుకు మోడీ చెప్పినట్టు తెలుస్తోంది.
ఇన్నాళ్లూ.. సుజనా చౌదరిని ఆఫ్ ద రికార్డ్ గా చంద్రబాబే వెనకేసుకొచ్చినట్టు అందరికీ తెలుసు. అలాంటి సుజనాచౌదరిపై.. ఇప్పుడు.. డైరెక్ట్ గా ప్రధాని మోడీనే అభ్యంతరం చెప్పేసరికి.. చంద్రబాబుకు నోట మాట రాలేదని తెలుస్తోంది. ఇప్పుడు అప్పులు తీర్చే విషయంలో.. సుజనాను ఎలా కన్విన్స్ చేయాలా అన్న ఆలోచనలో చంద్రబాబు పడిపోయారని.. ఆయన కాదంటే.. మరో నాయకుడికి మంత్రి పదవి ఇప్పించాల్సి వస్తే.. ఎవరికి ఇప్పించాలో అర్థం కాని సిచువేషన్ లో బాబు ఉన్నారని తెలుస్తోంది. అదీ కాక.. సుజనాచౌదరిని కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పిస్తే.. ఆయన అవినీతి చేశారు కాబట్టే.. పదవి నుంచి పీకేశారని ప్రతిపక్షాలు.. టీడీపీని టార్గెట్ చేసే అవకాశం కూడా ఉంది. అది డైరెక్ట్ గా.. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. సుజనా చౌదరి నుంచే.. విపక్షాలు టార్గెట్ ప్లాన్ మొదలు పెట్టి.. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే అవకాశం కూడా ఉంది.
సుజనా చౌదరి కేంద్ర మంత్రి పదవితో ముడిపడి ఉన్న ఈ అంశాలన్నీ… చంద్రబాబు మెదడును తీవ్రంగా తొలిచేస్తున్నాయట. దీంతో… రాజకీయాల్లో చంద్రబాబు సగభాగంగా.. అనధికారికంగా చలామణిలో ఉన్న సుజనాచౌదరిని ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి నుంచి దింపేయడం కంటే.. ఆయన పేరుతో ఉన్న అప్పులను క్లియర్ చేయించి.. మోడీ దగ్గర మంచి పేరు కొట్టేయాలని చంద్రబాబు ప్రయత్నించే అవకాశం ఉందని.. రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ.. ఓ సారి మోడీ దృష్టిలో నెగటివ్ ఫోకస్ పడిందంటే.. అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి దిగ్గజాలే.. మెట్టు దిగాల్సి వచ్చింది. అలాంటి వాళ్ల ముందు.. సుజనా చౌదరి ఎంత.. అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. చూడాలి.. సుజనాకు కేంద్ర మంత్రి పదవి ఉంటుందో.. ఊడుతుందో. చంద్రబాబు.. సుజనాను కేంద్ర కేబినెట్ లో ఎలా కాపాడుకుంటారో!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/